
1067 ఖాతాలకు ఆగిన అన్నదాత సుఖీభవ
44.75 లక్షల రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు జమైనట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ డిల్లీరావు తెలిపారు.
శనివారం విడుదల చేసిన అన్నదాత సుఖీభవ నగదు బదిలీ 99.98 శాతం రైతుల ఖాతాలలోకి నగదు జమైనట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ డిల్లీ రావు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి– మోడల్ కోడ్ అమలులో ఉన్న ప్రాంతాలలోని సుమారు ఒక లక్ష మంది రైతులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా లక్ష ఖాతాలు, యన్ పి సి ఐ లో చురుకుగాలేని, మ్యాపింగ్ కానీ లక్ష మంది రైతుల ఖాతాలను మినహాయించి తక్కిన వారికి సుమారు 44.75 లక్షల రైతుల ఖాతాలకు డబ్బులు జమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్ టి జి ఎస్ వివరాల ప్రకారం కేవలం 1067 ఖాతాలకు మాత్రమే నగదు బదిలీ కాలేదన్నారు. ఆగస్టు 3 గ్రీవెన్స్ మాడ్యులు లో తిరస్కరణ లోనైన లబ్ధిదారులు నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సీసీఆర్‌సీ కార్డులున్న భూమి లేని రైతులకు అక్టోబర్ నెలలో నిధుల విడుదల చేస్తామన్నారు.
పరిశీలన సమయంలో మృతులుగా గుర్తించబడిన దరఖాస్తుదారులు తిరస్కరణకు గురయ్యాయన్నారు. తప్పుగా ఆధార్ మ్యాపింగ్ అయిన కార్డుదారులు కూడా తిరస్కరణకు గురయ్యాయి. సివిల్ లిటిగేషన్ కేసులు, న్యాయపరమైన సమస్యలు ఉన్న ఖాతాలు లేదా నోషనల్ ఖాతాలు తిరస్కరణకు గురయ్యాయి. వ్యవసాయేతర భూములు అంటే అక్వా కల్చర్ లేదా ఇతర వ్యవసాయేతర ఉపయోగాల కోసం ఉన్న భూములు తిరస్కరించబడ్డాయి. నెలకు రూ. 20,000 కంటే ఎక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లించే వారు, ప్రజా ప్రతినిధులు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. డూప్లికేట్ దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. 10 సెంట్లు లోపల భూములు కలిగిన వారి దరఖాస్తులు అర్హత లేని వారు గా పరిగణించారు. ఈకేవైసీ చేయని వారిని కూడా అర్హత లేని వారుగా గుర్తించారు. గ్రీవెన్స్ మాడ్యూల్ ఆగస్టు 3వ తేది నుండి తిరస్కరితుల కోసం అందుబాటులోకి వస్తుందని, లబ్ధిదారులు తమ అభ్యంతరాలను లేదా సవరణలను అందులో నమోదు చేసుకోవచ్చని డిల్లీరావు తెలిపారు.
Next Story