ఆంధ్రలో ఎన్నికల ప్రచారం సోమవారం ఇలా..
x

ఆంధ్రలో ఎన్నికల ప్రచారం సోమవారం ఇలా..

టీడీపీ, జనసేన, వైసీపీ అధినేతలపై రాళ్ల దాడులు జరిగిన నేపథ్యంలో ఆంధ్ర ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఈరోజు ఎన్నికల ప్రచారాలు ఎలా జరగనున్నాయంటే..


ఆంధ్రలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రధాన పార్టీల అధినేతలపై వరుసగా రాళ్ల దాడులు జరగమే ఇందుకు కారణం. ఎవరు.. ఎందుకు ఈ దాడులు చేస్తున్నారో అన్న అంశాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తమపై దాడులు ఈ నేతలు తమ ప్రచారాన్ని నిలుపుకోలేదు. దాడి జరిగిన నిమిషాల వ్యవధిలోనే మళ్లీ ప్రచారాలను అదే జోరుతో కొనసాగించారు. దీంతో ఆంధ్ర ఎన్నికల ప్రచారాలు ఆసక్తికరంగా మారాయి. ప్రజల అందరి దృష్టి ప్రచారాలపైకి మళ్లింది. ఈ రోజు ప్రధాన పార్టీల ప్రచార షెడ్యూల్స్ ఇలా ఉన్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు పలాస నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. రాజాంలో పర్యటన ముగించుకున్న అనంతరం చంద్రబాబు హెలికాప్టర్‌లో పలాస చేరుకుంటారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు పలాసలో చంద్రబాబు భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. అనంతరం 7 గంటలకు నిర్వహించనున్న ‘ప్రజాగళం’ బహిరంగ సభలో కూడా చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే ఈరోజు విశాఖలోని గాజువాకలో చంద్రబాబు రాయి దాడి జరిగిన నేపథ్యంలో పలాసలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు అధికారులు. నిజానికి సోమవారం టెక్కలి, పలాస కేంద్రాల్లో పర్యటించాలని చంద్రబాబు షెడ్యూల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ప్రచారం కేవలం పలాసకే పరిమితమయింది.

సీఎం జగన్ చేస్తున్న ‘మేమంతా సిద్ధం’ యాత్ర సోమవారం ఉదయం 9 గంటలకు కేసరపల్లి బస పాయింట్ నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా యాత్ర జొన్నపాడు శివారుకు చేరుకుంటుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్, కార్యకర్తలు, నేతలు. విరామం తర్వాత జొన్నపాడు, జనార్దణపురం మీదుగా మధ్యాహ్నం 3:30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడుకు చేరుకుంటారు. అక్కడే బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ఆ తర్వాత గుడివాడ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్, పెండుర్రు మీదుగా సంగమూడి చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేస్తారు.

ఇదిలా ఉంటే ఏపీసీసీ షర్మిల ఈరోజు ‘న్యాయ యాత్ర’కు విరామం ఇచ్చినట్లు సమాచారం. పార్టీ కార్యకలాపాల కారణంగానే ఆమె ఈరోజు యాత్రకు విరామం ఇచ్చారని, కొందరు నేతలతో ఆమె ఈరోజు సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read More
Next Story