
3.22లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టింది.
కూటమి ప్రభుత్వం 3.22లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను రూపొందించింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రెవన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ. 40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోడు రూ. 79,926 కోట్లు అంచనాతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. అన్నదాత సుఖీభవ అమలు కోసం రూ. 6,300 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కోసం రూ. 6,705 కోట్లు కేటాయింపులు చేసినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్ రుణ సామర్థం సున్నాకు చేరుకుందన్నారు. అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందన్నారు. అయితే 2014–19లో రెండంకెల వృద్ధి రేటు సాధించిందన్నారు. ప్రధాని మోదీ సహకారంతో ముంబాయి, హైదరాబాద్ వంటి నగరాలకు ధీటుగా అమరావతిని అభివృద్ధి చేస్తామని మంత్రి పయ్యావుల చెప్పారు. ఆర్‌టీజీఎస్ కోసం రూ. 101 కోట్లు, దీపం పథకం అమలు కోసం రూ. 2,601 కోట్లు, మత్స్యకార భరోసా కోసం రూ. 450 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం రూ. 820 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కోసం రూ. 3,486 కోట్లు, ఆదరణ పథకం కోసం రూ. 1000 కోట్లు ప్రభుత్వం కేటాయింపులు చేసింది.
శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి
పాఠశాల విద్యా శాఖకు రూ. 31,805 కోట్లు
ఉన్నత విద్యకు రూ. 2,506 కోట్లు
స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణకు రూ. 1,228 కోట్లు
సాంఘిక సంక్షేమ శాఖకు రూ. 20,281 కోట్లు
గిరిజన సంక్షేమ శాఖకు రూ. 8,159 కోట్లు
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు రూ. 47,456 కోట్లు
మైనారిటీ సంక్షేమ శాఖకు రూ. 5,434 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయో వృద్దుల సంక్షేమ శాఖలకు రూ. 4,332 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ. 18,847 కోట్లు
మున్సిప్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు రూ. 13,862 కోట్లు
హౌసింగ్ శాఖకు రూ. 6,318 కోట్లు
ఇరిగేషన్ శాఖకు రూ. 18,019 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ. 3,156 కోట్లు
విద్యుత్ శాఖకు రూ. 13,600 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ. 8,785 కోట్లు
టూరిజమ్, కల్చర్, యూత్ సర్వీసెస్ శాఖకు రూ. 469 కోట్లు
తెలుగుదే భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ. 10 కోట్లు
జల్‌జీవన్ మిషన్ కోసం రూ. 2,800 కోట్లు
వ్యవసాయ శాఖకు రూ. 13,487 కోట్లు
పైరసరఫరాల శాఖకు రూ. 3,806 కోట్లు
2025–26 విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయం. దీని కోసం రూ. 9,407 కోట్లు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల కోసం రూ. 27,518 కోట్లు
Next Story