బంగ్లాదేశ్‌లో హిందువులపై అరాచకాలు ఆపాలి: పవ్ కళ్యాణ్
బంగ్లాదేశ్‌లోని హిందువుల గురించి ఏపీ డిప్యూటీ సీఎం మరో సారి ఘాటుగా స్పందించారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై అరాచకాలు, అఘాయిత్యాలను ఆపాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ టెంపుల్ పూజారి, ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అక్రమ అరెస్టులపై దేశ ప్రజలంతా ఏకమైన కలిసికట్టుగా పోరాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పొరుగు దేశమైన, స్నేహ భావంతో మెలుగుతున్న బంగ్లాదేశ్‌లో హిందువులను టార్గెట్‌ఆ చేసుకొంటున్న తీరు తనను కలచివేస్తోందని పేర్కొన్నారు. ఇది మంచి కాదన్నారు. బంగ్లాదేశ్ కోసం, ఆ దేశం ఏర్పాటు కోసం, ఆ దేశ ప్రజల రక్షణ కోసం భారత సైన్యం తన ప్రాణాలను పణంగా పెట్టి రక్తం చిందిందన్నారు. ఈ క్రమంలో భారత దేశం తన వనరులను కోల్పోయిందని, భారీ ఎత్తున ఖర్చు కావడంతో పాటు ఇండియన్ ఆర్మీ జవాన్లు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇప్పటికైనా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అరాచకాలను ఆ పాలని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యూసన్‌కు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు సోమవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.