
పవన్ పర్యటనలో అపరచిత వ్యక్తి
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి- ఉప ముఖ్యమంత్రికి చేరువగా సంచరించాడు. రోజు శంకరగుప్తం డ్రయిన్ మూలంగా దెబ్బ తిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోనూ, అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో, ఆ తరవాతి కార్యక్రమాల్లో కూడా సదరు వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించాడు. ఇతను రాజోలు నియోజక వర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం చేరింది. అతని వ్యవహార శైలి, కదలికలపై అనుమానం వ్యక్తమయింది. ఈ విషయాన్ని డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తీసుకువెళ్లారు. అతని కదలికలు, కార్యక్రమానికి జారీ చేసిన పాస్ అతను చేరడంపై ఉన్న సందేహాలను జిల్లా ఎస్పీకి వివరించారు. తగిన విచారణ చేపట్టాలన్నారు.
Next Story

