అమిత్‌షా నోట అమరావతి మాట!
x

అమిత్‌షా నోట అమరావతి మాట!

మళ్లీ అమరావతి కేంద్రానికి కనిపించింది. ప్రధాని మట్టీ, నీళ్లు ఇచ్చి వెళితే అమిత్‌షా మళ్లీ అమరావతిని నిర్మిస్తానని చెబుతున్నారు. ఇదీ ఈనాటి బిజెపి మాట.


కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టి ఐదేళ్లు గడిచాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం గురించి ఒక్క రోజు కూడా ఆలోచించలేదు. తిరిగి ఇప్పుడు మళ్లీ అమరావతిని ఏపీ రాజధాని చేస్తారట. చట్టాలు చేసినా అమలు చేయకుండా రాజకీయాలు ఉపయోగించుకొని మోసాలు చేసేందుకే పాలకులు అవుతున్నారు తప్ప ప్రజా సంక్షమం, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని ధర్మవరంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చేసిన ప్రసంగం ఆశ్చర్యాన్ని కలిగించిందనటంలో సందేహం లేదు.

రాయలసీమ అభివృద్ధి ప్యాకేజీ ఏమైంది? కడప ఉక్కు కర్మాగారం ఏమైంది? కృష్ణానదీ జలాలకే ఎసరుపెట్టే ప్రయత్నం చేస్తూ హంద్రీ–నీవ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఇంతకాలం దాని గురించి ఎందుకు మాట్లాడలేదు.
విభజన సందర్బంగా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదనేది మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఈ ఐదేళ్లు కేంద్ర పెద్దలు వారికి అనుకూలంగా ఉపయోగించుకున్నారు. రాష్ట్ర సమస్యలపై నోరెత్తకుండా చేశారు. ముఖ్యమంత్రిపై ఉన్న సీబీఐ కేసులు బూచిగా మారాయి. రాష్ట్ర ప్రయోజనాలు మట్టిపాలయ్యాయి. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాల్సిందేనని ఐదేళ్ల నుంచి ఒక్కసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పలేదు. ఇప్పుడు అమరావతిని ఎన్నికల ఆయుధంగా అమిత్‌షా మలిచారంటే ఎంతటి దిగజారుడు రాజకీయాలకు అమాత్యులు పాల్పడుతున్నారో అర్థం చేసుకోలేని వారు ఎవ్వరూ ఇక్కడ ఎవ్వరూ లేరు.
వెంకటేశ్వరుని పవిత్రతకు ఇప్పుడేం భంగం కలిగిందని..
వెంకటేశ్వరుని పవిత్రతను కాపాడతాం. బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు జగన్‌మోహ¯Œ రెడ్డికి ఆహ్వానం పంపినా రాలేదు. అందుకు జగన్‌మోహన్‌రెడ్డిని ఓడిచంyì అంటున్నారు అమిత్‌షా. వేంకటేశ్వరుడిని, బాలరాముడిని ఎన్నికల రాజకీయాల్లో ఆయుధాలుగా సంధించడాన్ని ఎన్నికల నియమావళి అనుమతిస్తుందా! మోడీ – అమిత్‌ షాలకు ఏ నియమావళి వర్తించదా అనేది చర్చగా మారింది. అందుకేనేమో వారు ఎక్కడ ఎటువంటి మాటలైనా మాట్లాడతారు. ఎన్ని అబద్దాలైనా చెబుతారు. ఏ దేవుడినైనా అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించడం విశేషం.
కామెడీ చేసిన అమిత్‌షా..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హిందూపురం నియోజకవర్గంలోని ధర్మవరంలో మాట్లాడిన మాటలు కామెడీని తలపించాయని ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక అధ్యక్షులు టి లక్ష్మినారాయణ విమర్శించారు. విభజన హామీలు మరిచారు, రాయలసీమ అభివృద్ధికి ఇవ్వాల్సిన ప్యాకేజీని, కడప ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు ఇవ్వలేదో చెప్పి ఉంటే బాగుండేది. డీపీఆర్‌–2కు ఆమోదం ఇంతవరకు లేదు, అమరావతిని ఇప్పుడు రాజధాని చేస్తారట, ఇది నమ్మాల్సిందేనా? వెంకటేశ్వరుని పవిత్రతను కాపాడుతారట, బాలరాముడి ప్రతిష్టకు జగన్‌ను పిలిచినా రాలేదట. ఇటువంటి మాటలు చెప్పి మతం పేరుతో ఓట్లు రాబట్టుకునే వారిని ఏమనాలన్నారు. జగన్‌ ప్రభుత్వం రూ. 13.50 లక్షల కోట్లు అప్పు చేసిన విషయం పార్లమెంట్‌లో ఒక్కరోజైనా చెప్పారా? ఇప్పించింది వారే కాబట్టి ఎందుకు చెబుతారన్నారు. రాష్ట్రంలో గూండాపాలన అంతం చేయడానికి టీడీపీతో జట్టుకట్టామంటున్న అమిత్‌షా జగన్‌పై ఉన్న సీబీఐ కేసుల విచారణను ఎందుకు ముందుకు తీసుకుపోవడం లేదో చెప్పాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి అన్ని రకాలుగా రక్షణ కవచంగా ఉన్నది మోదీ, అమిషాలేనని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు ఈ విషయాలన్నీ తెలుసు, అయినా అమిషా ఇలా మాట్లాడటం కామిడిగా ఉందనక ఏమంటారన్నారు.
Read More
Next Story