క్రికెటర్ అంబటి రాయుడికి బెదిరింపులు ఎందుకు?
x

క్రికెటర్ అంబటి రాయుడికి బెదిరింపులు ఎందుకు?

అంబటి రాయుడికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చంపేస్తామంటున్నారు. అవి రాజకీయమైనవా.. లేకుండా మరరేమైనానా..! ఈ బెదిరింపులు కోహ్లీ అభిమానులే చేస్తున్నారా..


అంబటి రాయుడు అందరికీ సుపరిచితమైన వ్యక్తే. తన దూకుడు నిర్ణయాలతో స్పోర్ట్స్‌లోనే కాకుండా ఆంధ్ర రాజకీయాల్లో కూడా సంచలనంగా మారారు. తొలుత వైసీపీలో చేరిన అంబటి.. వారం రోజుల్లోనే రాజీనామా చేసి ప్రస్తుతం జనసేనతో కలిసి తిరుగతున్నాడు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. అయితే ఇటీవల అంబటి రాయుడుకు కొన్ని తెలియని నెంబర్ల నుంచి ఫోన్స్ తెగ వస్తున్నాయట. ఫోన్స్ లిఫ్ట్ చేస్తే ఒకటే బెదిరింపులని, చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారని అంబటి స్నేహితుడు సామ్‌పాల్ వివరించారు. అంతటితో ఆగకుండా అంబటి కుటుంబ సభ్యులకు అత్యాచారంచేస్తామని, అంతకన్నా హీనమైన పదజాలంతో తిడుతున్నారని పాల్ వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రలో ఇదో పెద్ద చర్చనీయంశంగా మారింది.

రాజకీయ బెదిరింపులా

ఆంధ్ర ఎన్నికల కౌంటింగ్‌కు మరెన్నో రోజు గడువు లేదు. ఇప్పుడు అంబటి రాంబాబుకు బెదిరింపు కాల్స్ రావడం కీలకంగా మారింది. అతడిని భయపెట్టడానికి వైసీపీ వాళ్లే ఇలా చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు ఉన్నారు. తమకు వ్యతిరేకంగా జనసేనకు మద్దతుగా ప్రచారం చేశాడన్న కోపంతోనే వైసీపీ కార్యకర్తులు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారని, ఈ అంశంలోని సున్నితత్వాన్ని అర్థం చేసుకుని పోలీసులు రాయుడికి రక్షణ కల్పించాలని అభిమానులు కోరుతున్నారు.

సంబంధమే లేదా

అంబటి రాయుడికి వస్తున్న బెదిరింపులకు, ఆంధ్ర రాజకీయాలకు అసలు సంబంధమే లేదన్న వ్యాఖ్యలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌ కామెంటేటర్‌గా చేస్తున్న సమయంలో కోహ్లీపై రాయుడు చేసిన వ్యాఖ్యలే ఈ బెదిరింపులకు మూల కారణమని అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంబటి స్నేహితుడు సామ్‌పాల్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంబటి రాయుడు కుటుంబంతో కలిసి డిన్నర్‌కు తాను భయటకు వెళ్లినప్పుడు అంబటి భార్య తనకు ఈ విషయాలను వివరించినట్లు సామ్‌పాల్ వివరించారు.

అంబటి ఏం కామెంట్ చేశాడు!

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఆర్‌సీబీ జట్టుపై కామెంటేటర్‌గా ఉన్న అంబటి రాయుడు సెటైర్లు వేశాడు. కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆరెంజ్ క్యాప్ టోర్నీ టైటిల్‌ను తెచ్చి పెట్టదంటూ పరోక్షంగా కింగ్ కోహ్లీపై సెటైర్లు వేశాడు. ఆర్‌సీబీ వాళ్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడాన్ని టైటిల్ గెలిచిన స్థాయిలో సెలబ్రేట్ చేసకుంటున్నారని కూడా అంబటి అన్నాడు. దాంతో గుస్సా అయిన కోహ్లీ ఫ్యాన్స్.. అంబటికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టి సోషల్ మీడియాను షేక్ చేసేశారు. ఇందులో భాగంగానే కొందరు అంబటికి కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అంబటి కుటుంబీకులు, స్నేహితులు కోరుతున్నారు.

Read More
Next Story