అమరావతి ఉద్యమ గేయ రచయిత మృతి
x

అమరావతి ఉద్యమ గేయ రచయిత మృతి

రాజధాని అమరావతి ఉద్యమంలో విజయ్‌కుమార్‌ చేసిన కృషిని నాయకులు గుర్తు చేసుకున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఉద్యమ గేయ రచయిత బొప్పన విజయ్‌కుమార్‌ మరణించారు. అనారోగ్యతం బాధపడుతున్న ఆయన బుధవారం మృతి చెందారు. ఈయన ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి. సాంస్కృతిక చైదన్య వేదిక అధ్యక్షులు కూడా. విజయ్‌కుమార్‌ మరణం పట్ల రాజధాని అమరావతి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ) నాయకులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి జేఏసీకి చెందిన పలువురు నేతలు, పోలీసులు అధికారులు, వామపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, విజయ్‌కుమార్‌ భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి ఉద్యమంలో విజయ్‌కుమార్‌ చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు.

Read More
Next Story