24 ఏళ్లకే మరణించినా.. ఎందరికో స్ఫూర్తి అల్లూరి..
x

24 ఏళ్లకే మరణించినా.. ఎందరికో స్ఫూర్తి అల్లూరి..

రాజీలేని స్వాతంత్ర్య పోరాట యోధుడు, అమరవీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సందర్భంగా విజయవంతమైన AIDSO తిరుపతి నగర విద్యార్థుల 4వ మహాసభలు.


విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మరణించి నేటికి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, (AIDSO) ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బాలాజీ కాలనీ సర్కిల్ వద్ద ప్రారంభమై NTR సర్కిల్ మీదుగా తిరిగి బాలాజీ కాలనీ సర్కిల్ వరకు జరిగింది. ఆ తర్వాత అంబేద్కర్ భవన్ నందు తిరుపతి నగర విద్యార్థుల 4వ మహాసభలు జరిగాయి. ఈ మహాసభలకు ఉపన్యాసకులుగా సీనియర్ జర్నలిస్ట్ ఎ. రాఘవ శర్మ, SV యూనివర్సిటీ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ ప్రొఫెసర్ పి. సి వెంకటేశ్వర్లు, ఏఐడీఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి ఇ. మహేష్ హాజరయ్యారు. ఏఐడీఎస్ఓ తిరుపతి నగర అధ్యక్షులు వి. వెంకట సుబ్బయ్య మహాసభలకు అధ్యక్షత వహించారు.

రాఘవ శర్మ ప్రసంగిస్తూ.. గిరిజన ప్రజల విముక్తికై పోరాటం చేసి, 27 ఏళ్ళ వయసులోనే ప్రాణాలు అర్పించిన అల్లూరి మనకు ఆదర్శమని, నేటికీ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో గిరిజనులపై దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆదివాసీల సమస్యలు నేటికీ కొనసాగుతున్నాయని, మనీపూర్ లో జరిగిన అల్లర్లను అదుపు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం వహించిందని, స్త్రీ జాతిని అత్యంత అవమాన పరిచే విధంగా నగ్నంగా స్త్రీలను ప్రదర్శించడం చాలా బాధాకరమని అన్నారు. సామాజిక సమస్యలను పరిష్కరించడానికై అల్లూరి వారసులు విద్యార్థులలో ఉన్నారని అయన భావించారు.

ఏఐడీఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి ఇ . మహేష్ ప్రసంగిస్తూ.. అల్లూరి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చి విద్యార్థులలో నీతి నైతిక విలువలను పెంపొందించాలని, పాఠశాలల విలీనాన్ని ఆపాలని, డిగ్రీ లో CSP, ఇంటర్న్షిప్ విధానాలను తొలగించి, ఉన్నత విద్య డిగ్రీను కాపాడేవిధంగా డిగ్రీని మూడేళ్లు మాత్రమే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలలో ఏఐడీఎస్ఓ తిరుపతి నగర కమిటీను ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా యస్. నవీన్ కుమార్ కార్యదర్శిగా జి.ఉన్నతి, కోశాధికారిగా తేజశ్రీ , జాయింట్ సెక్రటరీలుగా మధు, ధీరజ్ లతో కూడిన 15 మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని AIDSO జిల్లా నాయకులు వెంకట సుబ్బయ్య వివరించారు.

Read More
Next Story