
పులివెందుల ఓట్ల లెక్కింపును బహిష్కరించిన వైసీపీ
కడప ప్రారంభమైన పులివెందుల, ఒంటిమిట్ట ఓట్ల లెక్కింపు
కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. కడప మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఓట్లను లెక్కిస్తున్నారు. పులివెందుల ఉప ఎన్నిక కౌంటింగ్‌ను 10 టేబుళ్లపై ఒక రౌండ్‌లో నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట ఉప ఎన్నిక కౌంటింగ్‌ను 10 టేబుళ్లపై సుమారు 3 రౌండ్లలో లెక్కిస్తున్నారు.
ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు చొప్పున ఉన్నారు. సూపర్వైజర్లు 30 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 60 మంది, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ముగ్గురు, తదితర సిబ్బంది కలిపి దాదాపు 100 మంది విధుల్లో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం లోపు ఫలితాలు వెల్లడి కావొచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్ నమోదైంది. ఒంటిమిట్టలో 86 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయంటూ వైసీపీ కౌంటింగ్‌ను బహిష్కరించింది. పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలను మించిన ప్రాధాన్యతను ఈ ఉపఎన్నిక సంతరించుకుంది. ఈ ఉపఎన్నిక ఓటింగ్ మంగళవారం పూర్తయింది.
ఏర్పాట్లు ఇవి...
కడప పాలిటెక్నిక్ కాలేజీ లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు.
1. పులివెందుల జడ్పిటిసి కౌంటింగ్ కోసం 10 టేబుల్లు ఏర్పాటు చేశారు.
2. ఒక టేబుల్ లో వెయ్యి ఓట్లు లెక్కించనున్నారు
3. మొత్తం ఒకే రౌండ్లో లెక్కింపు పూర్తి చేయడం ద్వారా తుది ఫలితం వెల్లడించనున్నారు.
ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానం
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్టలో కూడా జడ్పిటిసి స్థానానికి ఊపి ఎన్నికలు జరిగింది. ఈ ఓటును కూడా కడప పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో లెక్కించనున్నారు.
1. ఇందుకోసం 10 టేబుల్ లను ఏర్పాటు చేశారు.
2. ఒక్కో రౌండ్లో 1000 ఓటు లెక్కించడానికి వీలుగా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.
3. రెండు రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు.
గురువారం మధ్యాహ్నం రెండు జడ్పిటిసి స్థానాల ఫలితాలను వెల్లడించడానికి అవసరమైన ఏర్పడడానికి పోటీ చేసినట్లు జిల్లా పరిషత్ సీఈఓ ప్రకటించారు.