పవన్ కు మద్దతు ప్రకటించిన అఘోరీ
x

పవన్ కు మద్దతు ప్రకటించిన అఘోరీ

తాను కూడా సనాతన ధర్మ రక్షణ కోసమే పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఇద్దరి లక్ష్యం ఒకటే కాబట్టి పవన్ కు తన మద్దతు ఉంటుందని చెప్పారు.


సనాతన ధర్మ పరిరక్షణకు గట్టిగా పోరాడుతున్న జనసేన అధినేత, డిప్యుటి సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు లేడీ అఘోరీ మద్దతు పలికింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల(TTD Laddoo) తయారీలో కల్తీ నెయ్యివాడరని చంద్రబాబునాయుడు ఆరోపణలు చేయగానే పవన్ సడెన్ గా సనాతన ధర్మం(Sanatana Dharma)పై గొంతెత్తారు. ఒకసారి కాషాయ వస్త్రాలు కట్టుకుని మరోసారి ఎర్రటి వస్త్రాలు కట్టుకుని సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో విజయవాడ(Vijayawada)లోని కనకదుర్గ దేవాలయం(Kanaka Durga Temple) మెట్లను కడిగి కుంకుమబొట్లు పెట్టారు. ఇదేసమయంలో 11 రోజులు ప్రాయశ్చితదీక్ష చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అదంతా అయిపోయిన తర్వాత తిరుమల(TTD)కు వెళ్ళి శ్రీవారి దర్శనం తర్వాత తిరుపతి(Tirupati)లో జరిగిన బహిరంగసభలో సనాతన ధర్మంపై ఒక డిక్లరేషన్ కూడా ప్రకటించారు.

బహిరంగసలో డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత సనాతన ధర్మంపై పవన్ పెద్దగా మాట్లాడిందిలేదు. సనాతన ధర్మ రక్షణపై యాక్షన్ ప్లాన్ ను కూడా ప్రకటించలేదు. అందుకనే సనాతన ధర్మ రక్షణ కోసం పవన్ ఏమిచేయబోతున్నారనే ఆసక్తి ఆయన అబిమానులతో పాటు మామూలు జనాల్లో కూడా పెరిగిపోతోంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే కొద్దిరోజులు తెలంగాణాలో కలకలం సృష్టించిన లేడీ అఘోరీ తాజాగా ఒక ప్రకటన చేశారు. అదేమిటంటే సనాతన ధర్మం కోసం పోరాడుతున్న పవన్ కు తన మద్దతు ఉంటుందన్నారు. తాను కూడా సనాతన ధర్మ రక్షణ కోసమే పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఇద్దరి లక్ష్యం ఒకటే కాబట్టి పవన్ కు తన మద్దతు ఉంటుందని చెప్పారు.

తనను ఆహ్వానిస్తే పవన్ ను కలిసి ధర్మ రక్షణ విషయమై మాట్లాడుతానని కూడా చెప్పారు. దాదాపు రెండువారాలు తెలంగాణాలో కలకలం రేపిన లేడీ అఘోరీ(Aghori)ని పోలీసులు మూడురోజులు గృహనిర్భందంలో ఉంచారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కుసనపల్లి గ్రామంలోనే హౌస్ అరెస్టు చేసిన పోలీసులు తర్వాత ఆమెను మహారాష్ట్ర సరిహద్దులు దాటించి వదిలిపెట్టేశారు.

కార్తీకమాసం మొదలైన నేపధ్యంలో శివుడి ధ్యానం, పూజలు చేసుకునేందుకు కేదారనాధ్(Kedarnath) వెళుతున్నట్లు చెప్పిన అఘోరీ సడెన్ గా మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. ఈసారి రావటమే మీడియాతో మాట్లాడుతు పవన్ కు మద్దతు ప్రకటించారు. సనాతన ధర్మ రక్షణ కోసం ఇద్దరం కలిసి పోరాటంచేయటానికి అభ్యంతరాలు లేవని అఘోరీ ప్రకటించటం విశేషం.

Read More
Next Story