సోషల్ మీడియా కేసులపై మండలిలో వైఎస్‌ఆర్‌సీపీ వాయిదా తీర్మానం
సమావేశాల ఆరంభం నుంచి సోషల్ మీడియా కేసులపై చర్చించాలని వైఎస్‌ఆర్‌సీపీ మండలిలో పట్టుబడుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాల(సోషల్ మీడియా) కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపులపై చర్చించాలని వైఎస్‌ఆర్‌సీపీ తొలి నుంచి డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు మందు ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కేసులు తెరపైకి వచ్చాయి. వందలాది మంది వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తూ అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఏపీలో ప్రస్తుతం సోషల్ మీడియా కేసులు హాట్ టాపిక్ కావడంతో ఈ అంశంపై చర్చించాలని వైఎస్‌ఆర్‌సీపీ శాసన మండలిలో పట్టుబడుతూ వచ్చింది. ఆ మేరకు వాయిదా తీర్మానాన్ని కూడా ఇచ్చారు. అయితే దీనిని స్వీకరించని చైర్మన్ కొయ్యే మేషేన్ రాజు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరిస్కరించారు. దీంతో మరో సారి ఇదే అంశంపై చర్చించాలని వైఎస్‌ఆర్‌సీపీ కోరుతోంది. ఆ మేరకు మండలి సమవేశాలకు ఆఖరి రోజైన శుక్రవారం మరో సారి వాయిదా తీర్మానాన్ని శాసన మండలి ప్రధాన కార్యదర్శికి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పి రామసుబ్బారెడ్డి, తూమాటి మాధవరావు, మెండితోక అరుణ్‌కుమార్ వాయిదా తీర్మానాన్ని అందజేశారు.