
ప్రమాదమా? హత్యా?
కాలువలో పడిన ఘటనలో వివాహిత మృతి చెందగా 7 నెలల శిశువు గల్లంతు అయ్యాడు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో అనుమానాస్పద ఘటన కలకలం రేపింది. రొంపిచర్ల మండలం కొత్తపాలెంకు చెందిన శ్రీకాంత్, తన అనారోగ్యంతో బాధపడుతున్న 7 నెలల కుమారుడు శరత్, భార్య త్రివేణి (25)తో శుక్రవారం రాత్రి నరసరావుపేటలోని ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అయితే బొలెరో వాహనం అడ్డొచ్చి ప్రమాదం చోటుచేసుకుందని భర్త శ్రీకాంత్ చెబుతున్నాడు. మార్గమధ్యంలో కాలువ వద్ద ఒక బొలెరో వాహనం ఎదురుపడడంతో దాన్ని తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోయిందని దీంతో భార్య త్రివేణి, కుమారుడు శరత్ కాలవలో పడిపోయారని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story

