పరవాడలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం
x

పరవాడలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం

అనకాపల్లి జిల్లాలోని ఫార్మా కంపెనీలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి.


అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు ఆందోళనకరంగా మారాయి. వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఆగస్టులో సినర్జిన్‌ పరిశ్రమలో ప్రమాదం మరచిపోక ముందే మరో ఫార్మాసిటీ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో చోటు చేసుకున్న ప్రమాదం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఠాగూర్‌ ల్యాబొరేటరీస్‌ కంపెనీలో మంగళవారం రాత్రి విషవాయువు లీకై దాదాపు 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గాజువాకలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన ఒడిశాకు చెందిన అమిత్‌ అనే కార్మికుడి పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. అస్వస్థతకు గురైన వారిలో మరో ఇద్దరి కార్మికుల పరిస్థితి కూడా విషమంగా ఉంది.

ఈ ప్రమాదపు ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఠాగూర్‌ ల్యాబొరేటరీస్‌ ప్రమాదంపై ఆరా తీశారు. కార్మికుడి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులను అన్ని విధాలుగా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు, జిల్లా యంత్రాంగం దీనిని స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. దీనిపై అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ మాట్లాడుతూ ఠాగూర్‌ ల్యాబొరేటరీ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. రియాక్టర్, రిసీవర్‌ ట్యాంక్‌ నుంచి లిక్విడ్‌ హెచ్‌సీఎల్‌ లీకు కావడంతో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం స్థలంలో సీసీ టీడీ ఫుటేజీని సేకరస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాలని ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌కు ఆదేశించామన్నారు. తొమ్మిది మంది కార్మికులు అస్వస్థతతకు గురయ్యారన్నారు. శాస్వ,దగ్గు వంటి సమస్యలు తలెత్తయాన్నారు. అస్వస్థతకు గురైన వారిని గాజువాకలోని పవన్‌ సాయి ఆసుపత్రికి, విశాఖ షీలానగర్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి, తరలించి చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. అమిత్‌ అనే కార్మికుడు మరణించగా, మరో ఇద్దరు కార్మికులకు వెంటీలేటర్‌పై వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
Read More
Next Story