నేటి నుండి మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ
x

నేటి నుండి మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ

నూతన మద్యం పాలసీ అమలుకు సమయం ఆసన్నమైంది. ముందుగా తరఖాస్తుల స్వీకరణ చేయనున్నారు.


నూతన మద్యం పాలసీ అమలుకు సంబంధించి మంగళ వారం నుండి దరఖాస్తులను స్వీకరిస్తామని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. దీనికి సంభందించిన ఆర్డినెన్స్‌ జారీ అయ్యిందన్నారు. దరఖాస్తులు మూడు విధాలుగా సమర్పించొచ్చన్నారు. పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో డెబిట్, క్రెడిట్‌ కార్డులనుండి పేమెంట్‌ ఒక విధానం కాగా, బ్యాంకు చలానాల ద్వారా రెండో విధాన మన్నారు. మూడో పద్దతిలో డీడీ తీసుకుని నేరుగా రాష్టంలోని ఎక్సైజ్‌ స్టేషన్‌ ద్వారా అప్లికేషన్‌ పొందవచ్చని మీనా తెలిపారు. 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. నూతన మద్యం పాలసీ అక్టోబరు 12 నుంచి అమలు చేయనున్నారు. ఈ పాలసీ 2026 సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్సులను జారీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ సోమవారం అర్థరాత్రి తర్వాత ప్రభుత్వం జారీ చేసింది.మంగళవారం ఉదయం నుంచే దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. అయితే నాన్‌ రీఫండబుల్‌ రుసుం కింద ఒక్కో దానికి రూ. 2లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ ద్వారా లైసెన్సులను కేటాయించనున్నారు. ఈ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. అక్టోబర్‌ 11న ఈ లాటరీ ప్రక్రియను నిర్వహించనున్నారు. తర్వాత రోజు అంటే అక్టోబరు 12 నుంచి లైసెన్సులు పొందిన వ్యక్తులు కొత్త దుకాణాలను ప్రారంభించుకోవచ్చు.

Read More
Next Story