KTR and ACB|కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు..వెంటాడుతున్న దర్యాప్తుసంస్ధలు
x

KTR and ACB|కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు..వెంటాడుతున్న దర్యాప్తుసంస్ధలు

కేసుముందు ఏసీబీనే నమోదుచేసినా జెట్ స్పీడుతో ఈడీ రంగంలోకి దిగి విచారణకు నోటీసులు కూడా జారీచేయటం అప్పట్లో కలకలం రేపింది.


ఫార్ములా ఈ కార్ రేసు అవినీతిలో దర్యాప్తుసంస్ధలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను వెంటాడుతున్నాయి. ఈనెల 6వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ శుక్రవారం కేటీఆర్ కు నోటీసులు జారీచేసింది. ఈనెల 7వ తేదీన విచారణకు హాజరవ్వాలని ఇదివరకే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కరోజు తేడాలో రెండుదర్యాప్తు సంస్ధలు కేటీఆర్(KTR) ను విచరించబోవటం ఇపుడు సంచలనంగా మారింది. ఫార్ములా కార్ రేసు(Formula E Car Race0లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తో పాటు అప్పట్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డి మీద ఏసీబీ కేసులు పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసింది.

ఏసీబీ ఎఫ్ఐఆర్(ACB FIR) ఆధారంగా వెంటనే రంగంలోకి దిగేసిన ఈడీ(ED Inquiry) పై ముగ్గురిని విచారణకు రమ్మని నోటీసులు జారీచేసింది. కేసుముందు ఏసీబీనే నమోదుచేసినా జెట్ స్పీడుతో ఈడీ రంగంలోకి దిగి విచారణకు నోటీసులు కూడా జారీచేయటం అప్పట్లో కలకలం రేపింది. 2వతేదీన విచారణకు హాజరవ్వాల్సిన రెడ్డి, 3వ తేదీన హాజరవ్వాల్సిన అర్వింద్ హాజరుకాలేదు. మూడువారాల గడువు కోరితే ఈడీ జాయింట్ డైరెక్టర్ ఇద్దరినీ 8,9 తేదీలకు విచారణకు రమ్మని సమాధానం ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం 7వ తేదీన ఈడీ ముందుకు కేటీఆర్ విచారణకు హాజరవ్వాలి. మరి హాజరవుతారో లేదో చూడాలి.

ఈ విషయంలో సస్పెన్సు కంటిన్యు అవుతుండగా సడెన్ గా ఏసీబీ రంగంలోకి దిగేసింది. 6వ తేదీన విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీచేయటం సంచలనంగా మారింది. అంటే కేటీఆర్ ను విచారించేందుకు దర్యాప్తుసంస్ధలు నోటీసులతో వెంటాడుతున్నట్లు అర్ధమవుతోంది. ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతికి కేటీఆరే కారణమని ఏసీబీ ఇప్పటికే ప్రాధమిక విచారణలో నిర్ధారణకు వచ్చింది. ఈ నేపధ్యంలోనే విచారణకు రావాలని జారీచేసిన నోటీసులపై బీఆర్ఎస్(BRS) పార్టీలో కలకలం రేగుతోంది. విచారణకు పిలిపించి తమనేతపై ఏసీబీ, ఈడీలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటాయో అనే టెన్షన్ నేతలు, క్యాడర్లో పెరిగిపోతోంది. మరి 6వ తేదీన ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story