
అనాధగా మారిన రెండేళ్ల బిడ్డ
ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న దంపతుల మద్య తలెత్తిన అనుమానాలు బిడ్డను అనాధగా మార్చాయి.
ఇద్దరు ప్రేమించుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ప్రేమికుల దినోత్సవం నాడే వారు మ్యారేజ్ చేసుకున్నారు. పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చారు. కానీ ఆ అన్యోన్యం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లైన అనతి కాలంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అలా భార్యా భర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలు భార్య హత్యకు కారణంగా మారింది. భర్తే భర్యను కడతేర్చాడు. అటు తల్లి హత్యకు గురి కావడం, ఇటు తండ్రి జైలు పాలు కావడంతో ఆ చంటి బిడ్డ అనాధగా మారాడు.
అసలేం జరిగిందంటే..
విజయవాడలోని వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచే ఏలూరు జిల్లా నూజివీడు మండలం మట్టకొయ్యకు చెందిన సరస్వతికి, విజయవాడ భవానీపురంలోని శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసే కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన దీపాల విజయ్ కి పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవలనుకున్నారు. 2022 ఫిబ్రవరి 14 (వాలెంటైన్స్ డే)న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు పుట్టాడు. ఇప్పుడా బిడ్డకు రెండేళ్లు. పెళ్లైన కొద్ది నెలల్లోనే మధ్యస్థాలు మొదలయ్యాయి. దాదాపు 1.5-2 సంవత్సరాలుగా వేర్వేరుగా నివసిస్తున్నారు.
భర్త విజయ్ సరస్వతిపై అనుమానాలు పెంచుకున్నాడు. సరస్వతి బయట తిరుగళ్లు తిరుగుతుందని, వివాహేతర సంబంధాలు పెట్టుకుందని భర్త అనుమానాలు పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగు వస్తుండేవి. ఈ క్రమంలో ఇద్దరు విడిపోయి ఉంటున్నారు. భర్తపై వేధింపులు (డౌరీ/498A) కేసు దాఖలు చేసింది. దీంతో నూజివీడులో కేసు నమోదై, విజయ్‌కు 5 నెలల జైలు శిక్ష పడింది. విడాకులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని, తనపై తప్పుడు కేసులు పెట్టిందని భర్త, భార్యపై పగ పెంచుకున్నాడు. కోపంతో రగిలి పోతున్న భర్త, భార్య సరస్వతిని మట్టుబెట్టాలని భావించాడు.
విజయవాడలోని సూర్యరావుపేట ప్రాంతంలో గురువారం (నవంబర్ 13, 2025) మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో పట్టపగలు, నిత్యం రద్దీగా ఉండే స్వాతి ప్రెస్ సమీపంలోని వీన్స్ ప్రైవేటు ఆసుపత్రి వద్ద డ్యూటీ ముగించుకొని బయటకు వస్తున్న స్టాఫ్ నర్స్ సరస్వతిని భర్త కత్తితో విచక్షణారహితంగా పొడిచి, గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. స్థానికులు ఆపేందుకు ప్రయత్నించినా, కత్తి బెదిరింపులతో వారిని దూరంగా పరిగెత్తించాడు. చివరికి పోలీసులు చేరుకొని విజయ్‌ను అరెస్టు చేశారు.
కుటుంబ విబేదాలే కారణమని పోలీసులు నిర్ధారించారు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని, తనపై ఫాల్స్ కేసులు పెట్టి జైలుకు పంపించిందని, విడాకులు ఇవ్వకుండా వేధిస్తోందని అందుకే తన భార్యను హత్య చేసినట్లు భర్త పోలీసుల విచారణలో భర్త తెలిపాడు. ప్రస్తుతం విజయ్‌పై IPC సెక్షన్ 302 (మర్డర్) కింద కేసు నమోదైంది, రిమాండ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల బిడ్డ అనాధగా మారాడు. తల్లిదండ్రుల ఆలనా పాలనకు దూరమయ్యాడు.

