తిరుపతిలో మరణించిన పులి
x

తిరుపతిలో మరణించిన పులి

11 ఏళ్లు ఉన్నప్పుడు బెంగుళూరు నుంచి తిరుపతి జూకి తీసుకొచ్చారు. గత రెండు నెలలుగా ఆహారం తీసుకోవడం తగ్గించింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఓ పులి మృత్యువాత పడింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాలలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మధు అనే రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ప్రాణాలు విడిచింది. ఈ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌కు 11 ఏళ్లు వయసు ఉన్నప్పుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూకి తీసుకొచ్చారు. బెంగుళూరులోని బన్నెరగట్ట బయోలాజికల్‌ పార్కును నుంచి 2018లో దీనిని తిరుపతి జూకి తీసుకొచ్చారు. నాటి నుంచి దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఈ జంతు ప్రదర్శన శాఖ సంరక్షణలోనే ఈ పులి ఉంది. సందర్శకుల కోసం ప్రదర్శనకు పెట్టేవారు. అయితే వయసు మీదపడటం కారణంగా సుమారు రెండు సంవత్సరాల నుంచి సందర్శకుల నిమిత్తం ప్రదర్శనకు పెట్టం లేదు. వృద్దాప్యం కారణంగా సరిగా ఆహారం కూడా తీసుకోవడం లేదు. రెండు నెలలుగా తగిన ఆహారం కానీ నీళ్లు కానీ తీసుకోవడం లేదు. వయసులో పెద్దది కావడం, సరిగా ఆహారం తీసుకోక పోవడం వల్ల సోమవారం ఈ పులి మరణించింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాల పాథాలజీ డిపార్ట్‌మెంట్‌ వైద్యుల బృందం ఆధ్వర్యంలో ఈ పులి కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. వృద్దాప్యం, సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలోని వివిధ అవయవాల పని చేయని కారణంగా ఈ మధు అనే రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ మరణించినట్లు వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టంలో నిర్థారించారు.

Read More
Next Story