'గేదెల సర్వే' పై సెటైర్ అదిరిపోలా!
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ, టీడీపీల మధ్య ప్రత్యక్షపోరుతో పాటు సోషల్ మీడియా వార్ కూడా తారాస్థాయిలో ఉంది. తమలపాకుతో ఒకళ్లు ఒకటంటే తలుపు చెక్కతో వాళ్లు రెండంటున్నారు
(శివరామ్)
ఆంధ్ర ప్రదేశ్ అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య ప్రత్యక్షపోరుతో పాటు సోషల్ మీడియా వార్ కూడా తారాస్థాయిలో ఉంది. వేటుకు పోటు, పోస్ట్ కు పోస్ట్ అనే రేంజ్ లో సాగుతోంది. తాజాగా ఓ సర్వేపై సాగుతున్న పోస్టుల యుద్ధం చూస్తుంటే మొత్తం ఎన్నికల ప్రచార సరళే మారిపోయిందన్న రీతిలో సాగుతోంది. ఎన్నికల నామినేషన్లకు సరిగ్గా 24 గంటల ముందు అధికార పార్టీ కే గెలుపంటూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సర్వే పై వైసీపీ, టీడీపీ ట్విట్టర్ వార్ పీక్స్‌కు చేరింది. పాత ఫోటోలు, పాత క్లిప్పింగ్ లు , అప్పటి ప్రసంగాలు వంటివన్నీ మళ్లీ తెరమీదకు వచ్చేస్తున్నాయి.
అసలేం జరిగిందంటే...
ఏపీలో వైసీపీ జెండా ఎదురే లేకుండా ఎగరబోతోందంటూ వైసీపీ పార్టీ ట్వీట్ చేసింది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సంస్థ సర్వే నిర్వహించిందని ఈ సర్వేలో వైసీపీకి ఏకంగా 135 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు వస్తాయని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన , బీజేపీ కూటమికి 40 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు మాత్రమే వస్తాయని నియోజక వర్గాల వారీ వివరాలు పొందుపరిచిన సర్వే రిపోర్ట్‌ను వైసీపీ ట్వీట్ చేసింది.
గేదెల కంపెనీ రిపోర్టు అంటూ అదిరిపోయే కౌంటర్
దీనికి తెలుగుదేశం పార్టీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ‘గేదెల పొదుగుకి మందులు అమ్మే కంపెనీ సర్వే చేసిందా? ఇదేమి సర్వే రా బాబు మీ గన్నవరం గూట్లే చేశాడా? లేక మీ పార్టీ వాళ్లు మొత్తం బుర్రలేని గొర్రెలని ఐప్యాక్ వాడు సలహా ఇచ్చాడా?’ అని టీడీపీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ గతంలో ఇచ్చిన యాడ్ ఫొటోను జత చేసింది. దీంతో గేదెల సంస్ద సర్వేలు చేయడమేమిటని నెట్ జనులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ సర్వే మనుషులతో చేశారా? లేక గేదల మందల నుంచి వివరాలు సేకరించి నివేదిక తయారు చేశారా? అంటూ రకరకాల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మనుషులు సర్వేలు గెలిపించక గేదేల సర్వేల మీద వైసీపీ ఆధార పడిందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ సర్వేపైన కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటూ కొందరు టీడీపీ నేతలు ముందుకొస్తున్నారు.
Next Story