రెండో క్లాస్ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు
x

రెండో క్లాస్ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు

నిజానికి 2వ తరగతి చదువుతున్న పిల్లాడికి చావు, పుట్టుకల గురించి కూడా ఏమీతెలీదు.


ప్రాణాలంటే లెక్కలేకుండా పోతోంది. పెద్దలనుండి పిల్లలవరకు చిన్న విషయాలకు కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే హత్యలు లేకపోతే ఆత్మహత్యలు సమాజంలో పెరిగిపోతున్నాయి. ఇపుడు విషాధం ఏమిటంటే 2వ తరగతి చదువుతున్న(2nd Class) 9 ఏళ్ళ పిల్లాడు ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన వెల్దండలో జరిగింది. నిజానికి 2వ తరగతి చదువుతున్న పిల్లాడికి చావు, పుట్టుకల గురించి కూడా ఏమీతెలీదు. అయినా ఈ పిల్లాడు ఆత్మహత్య చేసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ముగ్గురు సోదరుల మధ్య చిన్నపాటి గొడవతో మూడోపిల్లాడు రిషి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ ఏమి జరిగిదంటే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని అల్లంతోటబావి తండాలో ముగ్గురు అన్నదమ్ములు తమ అమ్మమ్మ దగ్గర వుండి చదువుకుంటున్నారు.

రంగారెడ్డి జిల్లా(Rangareddy District) మాడ్గుల మండలంలోని శనగలగట్టు తండాలో ఉంటున్న దేవ్యానాయక్ కు ముగ్గురు పిల్లలు. దేవ్యానాయక్ హైదరాబాదులో ఆటో డ్రైవర్ గా ఉన్నాడు. ఆర్ధిక సమస్యల కారణంగా పిల్లల పోషణ, చదువు భారం కారణంగా అల్లంతోటబావి తండాలో ఉన్న అత్తగారింటికి పంపించాడు. పిల్లలు కూడా తండాలో ఉన్న ప్రభుత్వ స్కూలులోనే చదువుకుంటున్నారు. ముగ్గురిలో పెద్ద కొడుకు జిల్లా పరిషత్ హైస్కూలులో చదువుతున్నాడు. రెండు కొడుకు నాలుగో తరగతి, చివరివాడు రిషి 2వ తరగతి చదువుతున్నాడు. శనివారం అమ్మమ్మ, తాతలు బయటకు వెళ్ళగా అన్నదమ్ములు ముగ్గురు ఇంటిముందే ఆడుకుంటున్నారు. ఆటల్లో అన్నలిద్దరు తమ్ముడిని ఎగతాళిచేస్తు ఆటపట్టించారు. దాంతో ఆట మధ్యలోనే రిషి వచ్చేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

ఇంట్లోకి వెళ్ళిన తమ్ముడు ఎంతకీ బయటకు రాకపోవటంతో అన్నల్లిద్దరు గట్టిగా పిలిచారు. అయినా తమ్ముడు ఎంతకీ పలకకపోయేసరికి పెద్దవాళ్ళిద్దరు ఇంట్లోకి వెళ్ళారు తమ్ముడికోసం. అయితే లోపలకు వెళ్ళిన ఇద్దరికీ ఒకేసారి షాక్ కొట్టినట్లయ్యింది. ఎందుకంటే బట్టలు ఆరేసే తాడును పైన ఉన్న కొక్కీకి వేసి మెడకు తాడుబిగుసుకుని వేలాడుతూ కనిపించాడు. అక్కడే ఒక స్టూలు కిందపడిపోయుంది. దాంతో వెంటనే అన్నలిద్దరు భయంతో బయటకు వచ్చేసి పక్కింట్లో ఉన్న మహిళను పిలుచుకుని వచ్చారు. మహిళ సాయంతో ఇద్దరు తాడును మెడనుండి విడదీసి తమ్ముడిని వెల్దండలోనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అయితే ఆసుపత్రికి వచ్చేటప్పటికీ రిషి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. మృతుడి ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Next Story