వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
x

వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగండంగా బలపడిందని జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. అది ఈశాన్య దిశగా కదులుతోందని, శనివారం ఉదయానికి తుఫానుగా..


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగండంగా బలపడిందని జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. అది ఈశాన్య దిశగా కదులుతోందని, శనివారం ఉదయానికి తుఫానుగా మారుతుందని, శనివారం రాత్రికి తీవ్రతుఫానుగా బలపడుతుందని వారు ఆంధ్ర రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అక్కడి నుంచి ఉత్తరం వైపు కదుతులూ ఆదివారం అర్థరాత్రికి సమయంలో బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాల దగ్గరలో సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య తీవ్రతుఫానుగానే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వివరించారు. కానీ దీని ప్రభావం ఏపీపై ఏ స్థాయిలో ఉంటుందన్న అంశంపై స్పష్టత లేదని చెప్పారు.

కానీ రేపు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాటు కురిసే అవకాశ ఉన్నట్లు వివరించారు. దాంతో పాటుగా విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణ, కోనసీమ, అన్నమయ్య, తిరుపతి, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, బాపట్లు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు.

అదే విధంగా ఆదివారం రోజున పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామారాజు, కృష్ణా, ఎన్‌టీఆర్, గంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, కర్నూలు, నెల్లూరుడు, నంద్యాల, అన్నమయయ్య సహా పలు ఇతర జిల్లాల్లో అక్కడక్క పిడుగులతో కూడి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని, ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించారు.

దీంతో పాటుగా రాష్ట్రంలో మరోవైపు ఎండలు కూడా మండుతున్నాయని చెప్పారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో 42.9 సెంటిగ్రేడ్స్, నంద్యాల జిల్లా బనగానపల్లిలో 42.2 సెంటిగ్రేడ్, నెల్లూరులో 42.2 సెంటిగ్రేడ్, ప్రకాశం 42 సెంటిగ్రేడ్, జమ్ములమడుగులో 41.8 సెంటిగ్రేడ్, కర్నూలులో 41.6 సెంటిగ్రేడ్‌లు నమోదయిందని వివరించారు.

Read More
Next Story