పేరు అమీర్, ఆకలితో బేజార్.. ఇంత దారుణమా వల్లీ!
x
ఏఐ ఇమేజ్

పేరు అమీర్, ఆకలితో బేజార్.. ఇంత దారుణమా వల్లీ!

ఆకలి బాధతో గొంతుకోసుకున్న కూలీ, పని లేక మూడు రోజులుగా పస్తులు


ఆంధ్రప్రదేశ్.. అన్నపూర్ణ అంటుంటారు. అటువంటి రాష్ట్రంలో అదీ సింహపురి గడ్డ మీద ఆకలితో అలమటించి ఓ వ్యక్తి గొంతుకోసుకున్న దారుణం సంఘటన జరిగింది.
అంతటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పేరు అమీర్ వల్లి. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామం. కూలి పనుల కోసం ఉన్న ఊరు వదిలి నెల్లూరు వెళ్లారు. మూడు రోజులుగా ఎటువంటి పనులు దొరక్కపోవడంతో ఆకలితో అలమటించారు. చేతిలో డబ్బులు లేవు. కడుపు కాలుతోంది. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో తీవ్ర నిరాశనిస్పృహలకు లోనయ్యాడు. కనకమహల్ సెంటర్ కు వచ్చారు. కత్తితో గొంతు కోసుకున్నారు. దీంతో చుట్టుపక్కల జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితుణ్ణి అమీర్ వల్లిగా గుర్తించారు.
కూలి పనులు దొరక్కపోవడంతో మనస్థాపానికి గురైన అతడు కఠిన నిర్ణయం తీసుకున్నాడని ఆయన్ను గమనించిన వ్యక్తులు కొందరు చెప్పారు. ఆకలి బాధతో తన గొంతు తానే కత్తి కోసుకున్నాడు. స్థానికులు ఇచ్చి సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు పోలీసులు. రక్తస్రావం అవుతున్న అమీర్ వల్లిని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అమీర్ వల్లికి ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు వైద్యులు.
Read More
Next Story