కాశీబుగ్గలో తొక్కిసలాట..9 మంది మృతి
x

కాశీబుగ్గలో తొక్కిసలాట..9 మంది మృతి

శ్రీకాకుళం కాశీబుగ్గలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.


ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ప్రసిద్ధ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం ఘోర తొక్కిసలాట జరిగింది. కార్తీక మాస ఏకాదశి సందర్భంగా భారీ భక్తులు పోటెత్తడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో కొందరిని గుర్తించారు. వారి పేర్లు డి.రాజేశ్వరి, సీహెచ్‌.పశోదామి,వై.చిన్నమ్మి, ఆర్‌.విజయ, ఎం.నేలమ్మ.



ఘటన వివరాలు

కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయం 'చిన్న తిరుపతి'గా పేరుగాంచిన పవిత్ర క్షేత్రం. ఇక్కడ శ్రీవారి మూల విరాట్‌తో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవారు, ఆంజనేయ స్వామి, గరుడ విగ్రహాలు కొలువుదీరాయి. శనివారం ఏకాదశి కావడంతో ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో దర్శనం కోసం తరలి వచ్చారు. దేవాలయ సామర్థ్యం 2-3 వేలు. ఈరోజు కార్తీక ఏకాదశి, శనివారం కావడంతో వెంకన్న స్వామి దర్శనం కోసం భారీగా భక్తజనం వచ్చారు. 25 వేల మందికి పైగా తరలివచ్చిఉంటారని అంచనా.

పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు

ప్రత్యక్ష సాక్షుల మాట్ల ప్రకారం, భక్తుల తాకిడికి రెయిలింగ్ (కాంతి గోడ) ఊడిపోవడంతో పలువురు కిందపడ్డారు. దీంతో మిగిలినవారు ఒకరిపై ఒకరు పడిపోయి, తీవ్ర స్పృహలోపం, గాయాలు పాలయ్యారు. ఘటన స్థలానికి రక్షణ బృందాలు, పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది చేరుకొని హుటాహుటిగా సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.

ఆలయ నిర్మాణం

ఆలయ నిర్మాణం వెనక ఆసక్తికరమయిన కథ ప్రచారంలో ఉంది. తిరుపతిలో వెేంకటేశ్వర స్వామి దర్శనం తనకు కావడంలేదని అసంతృప్తి చెందిన భక్తుడొకరు కాశీబుగ్గ లో ఆలయనిర్మాణానికి పూనుకున్నారు.తన సొంత భూమిలోనే ఆలయ నిర్మాణం చేపట్టాడు. ఇది ఏడాది పూర్తయింది. దీనికి చిన్న తిరుపతి అని పేరుకూడా పడింది. తిరుమలలకు వెళ్లి దర్శనం చేసుకోవడం అనేది సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల ఈ వెనకబడి ప్రాంతానికి చెందిన వేలాి మంది ప్రజలు ఈ గుడిలోని దేవుడిని దర్శించుకుని తిరుపతి వెళ్లొచ్చమాన్న తన్మయత్వం పొందుతుంటారని ఒక భక్తుడు చెప్పారు. ఈ గుడి ప్రారంభించినప్పటి నుంచి వస్తున్న వేలాది మంది భక్తులే దీనికి సాక్ష్యం. మృతులంతా పేదకుటుంబాల వారే.

ప్రభుత్వ ఏర్పాట్లు లేవు

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఏపీ దేవాదాయశాఖ స్పందించింది. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రైవేట్ ఆదీనంలో ఉంది. ఒడిశా రాజ కుటుంబం కాశీబుగ్గలో ఈ గుడి కట్టారు. గుడి జులైలోనే ప్రారంభమైంది. ఏకాదశి సందర్భంగా పెద్దఎత్తున భక్తులు వస్తారని ఆలయ నిర్వాహకులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు. అందువల్ల ఎలాంటి ఏర్పాట్లు చేపట్టలేదని దేవాదాయ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

హోం మంత్రి అనితి వివరణ

ప్రతి శనివారం 1500 నుంచి 2 వేల మంది భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. ఆలయం మొదటి అంతస్తులో ఉంటుంది: 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం ఒక రెయిలింగ్ ఏర్పాటు చేశారు. ఈ రోజు రద్దీ కారణంగా రెయిలింగ్‌ ఊడిపోయింది. దీనితో తొక్కిస లాట జరిగిందని రాష్ట్ర హోంమంత్రి వి. అనిత చెప్పారు."రెయిలింగ్‌ ఊడిపడటంతో మెట్ల మీది నుంచి ఒకరిపై ఒకరు పడ్డారు తొక్కిసలాట జరిగింద. తొక్కిసలాటలో ఎక్కవ మంది మహిళలు మృతిచెందారు. ఇది బాధకరం,’’ అని ఆమె అన్నారు. గాయపడినవారికి ప్రాణాపాయం లేదని కూడా ఆమె చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సానుభూతి

ఈ దుర్ఘటన వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయాల పాలైనవారికి సత్వర చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించాను" అని సీఎం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.



అధికారుల చర్యలు , దర్యాప్తు

శ్రీకాకుళం కలెక్టర్ రవీందర్ మాట్లాడుతూ, "ఘటనా స్థలంలో పూర్తి నియంత్రణ ఏర్పాటు చేశాము. గాయపడినవారికి అత్యవసర చికిత్స అందిస్తున్నాము. ఆలయ భద్రతా ఏర్పాట్లలో ఏవైనా లోపాలు ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నాము" అని తెలిపారు.

Read More
Next Story