కడప జిల్లాలో 87మిమీ వర్షపాతం
x

కడప జిల్లాలో 87మిమీ వర్షపాతం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మేఘావృతమై ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


నైరుతి రుతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి వైఎస్‌ఆర్‌ కడప జిల్లా సెట్టివారిపల్లిలో 87.5మిమీ, విజయనగరం జిల్లా గుర్లలో 87.5మిమీ, అదే జిల్లా వేపాడలో 79.2మిమీ, నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 79మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 74మిమీ వర్షపాతం నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందిని పేర్కొంది. ౖ మే 31 శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, వైఎస్‌ఆర్‌ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Read More
Next Story