ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి
x

ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి

ఆంధ్ర రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలకు నిండు ప్రాణాలు బలవుతున్నాయి. ఈరోజు ఆంధ్రలో సంభవించిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో


ఆంధ్ర రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రతి రోజు ఎక్కడోఒకచోటు రోడ్డు ప్రమాదాలకు నిండు ప్రాణాలు బలవుతున్నాయి. ఈరోజు ఆంధ్రంలో సంభవించిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాటి వల్ల ఏదైనా ఫలితం వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇది వాహనదారుల నిర్లక్ష్యమా, మరేమైనా అన్నది అర్థం కావట్లేదు. ఈరోజు ఉదయం కృష్ణా జిల్లా, తిరుపతిలో రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ రెండు ప్రమాదాలు దారి తీసిన పరిస్థితులు ఒకేలా ఉన్నాయి.

కృష్ణా జిల్లాలో ప్రమాదం

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పడంతో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే వీరవల్లి ఎస్‌ఐ చిరంజీవి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కొవ్వూరు నుంచి తమిళనాడుకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదానికి అతివేగం, నిద్రలేమి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు.

తిరుపతిలో మరో ప్రమాదం

తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో తెల్లవారుజామున కొంగరవారి పల్లి దగ్గర ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కూడా నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదానికి నిద్రమత్తు, అతివేగం కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతులను నెల్లూరు జిల్లా వాసులుగా వారు గుర్తించారు. ప్రస్తుతం మృతుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వివరించారు.

Read More
Next Story