అనకాపల్లి జిల్లాలో 3.55 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం
గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్‌లను విరివిగా ఉపయోగించాలని ఆలోచనలు చేపట్టింది.
గంజాయి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గంజాయి విక్రయాలపై నిఘా పెట్టిన ప్రభుత్వం వాటిని విక్రయిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ సారి గంజాయి మూలాలపైనే దృష్టి పెట్టింది. గంజాయి సాగునే లేకుండా చేసేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించింది. దీని కోసం డ్రోన్‌లను ఉపయోగించనుంది. ఇప్పటికే డ్రోన్‌లతో ఉత్తరాంధ్రలోని కొన్ని ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. అనకాపల్లి జిల్లాలో దాదాపు 3.55 ఎకరాల్లో డ్రోన్ల సాయంతో గంజాయి సాగును అధికారులు ద్వంసం చేశారు.
గంజాయి మొక్కను గుర్తించేందుకు కొన్ని పద్ధతులను అనుసరిస్తున్నారు. భూమి నుంచిౖ 3 అడుగులు ఎత్తు పెరిగిన గంజాయి మొక్కలను సైతం కనుగొనేలా హెచ్‌డీ చిత్రాలను తీసే మల్టీ స్పెక్టరల్ కెమేరాలను డ్రోన్లకు అమర్చి, తద్వారా గంజాయి సాగును సులువుగా గుర్తించి, ధ్వంసం చేయాలని ప్లాన్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఇది సక్సెస్ కావడంతో దీనిని ఫాలో కానున్నారు. అంతేకాకుండా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), గూగుల్ సహాయం తీసుకొని శాటిలైట్‌తో హాట్ స్పాట్‌ల ద్వారా గంజాయి సాగును గుర్తించనున్నారు.
Next Story