
250 కోట్ల యూరియా స్కాం–మెడికల్ సీట్లు వద్దన్న దుర్మార్గుడు చంద్రబాబు
కళ్లార్పకుండా అబద్దాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని జగన్ సెటైరికల్ విమర్శలు గుప్పించారు.
యూరియా విషయంలో రూ. 250 కోట్ల స్కాం జరిగిందని, మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ముఖ్యమంత్రి, దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు అని వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.. కనీసం ఒక్క ప్రభుత్వ ఆసుపత్రినైనా తీసుకొచ్చారా? అంటూ నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఏపీలోని 26 జిల్లాల్లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతులు తీసుకొచ్చమాన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలు, యూరియా మీద సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వ ఆసుపత్రులను నపడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకీ కూడా చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కళాశాలలు లేకపోతే పేదలు దోపిడీకి బలవుతారని, ఆర్టీసీని ప్రైవేటు సంస్థలు నడిపిస్తే సామాన్య ప్రజలు ఆ బస్సులను ఎక్కగలరా? అంటూ ప్రశ్నించారు. 19923 నుంచి 2016 వరకు రాష్ట్రంలో మొత్తం 12 మెడికల్ కళాశాలు మాత్రమే ఉండేవని, తాము అధికారంలోకి వచ్చాక 26 జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలని ప్రయత్నించామన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లతో భర్తీకి అనుమతులు మంజూరు అయ్యాయని, కేవలం పులివెందుల మెడికల్ కాలేజీ అనే ఉద్దేశంతోనే మెడిల్ సీట్లు తమకు వద్దని చంద్రబాబు లేఖ రాశారని మండిపడ్డారు.
తమ హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో ఎన్నికల నాటికే పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి, ఏడు మెడికల్ కళాశాలల్లో తరగతులు మొదలయ్యాయి, 800 సీట్లు అప్పటికే భర్తీ అయ్యాయని జగన్ వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చే నాటికే 2,360 మెడికల్ సీట్లు ఉండేవని, కొత్త కాలేజీల ద్వారా 2550 సీట్లకు పెంచే ప్రయత్నం చేశామని, తమ హయాంలో కొత్తగా 800 మెడికల్ సీట్లు తీసుకొచ్చినట్లు జగన్ వెల్లడించారు. యూరియా బ్లాక్ మార్కెట్‌కు సీఎం చంద్రబాబే భాగస్వామని జగన్ విమర్శించారు. ఎరువులు దొరక్క రైతులు అల్లాడిపోతున్నారని, సీఎం సొంత జిల్లా కుప్పంలో కూడా రైతులు నానావస్థలు పడుతున్నారని జగన్ మండిపడ్డారు. తమ హయాంలో ఏ నాడైనా రైతులు రోడ్లెక్కారా? అని ప్రశ్నించారు.
తమ పాలనో ఉన్న అధికారులే ఇప్పుడూ ఉన్నారని, కానీ ఎరువుల సమస్య ఎందుకొచ్చిందని నిలదీశారు. ఆర్బీకేలను, ఈ క్రాప్ వ్యవస్థనూ నిర్వీర్యం చేశారని, టీడీపీ నేతలే దారి మళ్లించి ఎక్కువ ధరలకు ఎరువులను అమ్ముకుంటున్నారి ఆరోపించారు. ఎరువుల స్కామ్‌లో రైతులను పీడించి అందరూ పంచుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. సూపర్ సిక్స్ ఒక అట్టర్‌ప్లాప్ సినిమా అని, అలాంటి దానికి బుధవారం అనంతపురంలో బలవంతపు విజయోత్సవాలు జరుపుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. కళ్లర్పకుండా అబద్దాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు.