విశాఖపట్నం సీఐఐ సదస్సులో నేడు 25 సెషన్స్
x

విశాఖపట్నం సీఐఐ సదస్సులో నేడు 25 సెషన్స్

విశాఖపట్నంలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ప్రారంభమవుతోంది.


రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సును ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. సదస్సుకు ముందు ఉపరాష్ట్రపతి, అతిథులకు సీఎం అల్పాహార విందు ఏర్పాటు చేశారు.

సదస్సులో రాష్ట్ర గవర్నర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారు. ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. దేశం, విదేశాల నుంచి వచ్చిన యూసుఫ్ అలీ, బాబా కళ్యాణి, కరణ్ అదానీ వంటి విశిష్ట అతిథులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.

రెండు రోజుల ముందు నుంచే విశాఖలో ఉన్న సీఎం చంద్రబాబు గురువారం పలు సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. సదస్సు ప్రారంభానికి ముందు రోజు రూ. 3.65 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు కుదిరాయి. ఈరోజు డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

సదస్సులో మొత్తం 45కు పైగా సెషన్లు నిర్వహించనున్నారు. తొలి రోజు 25 సెషన్లలో వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయి. ఏకకాలంలో నాలుగు సెషన్లు నడుస్తాయి. కీలక సెషన్లలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు.

ఈ సదస్సు ద్వారా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా. 50కు పైగా దేశాల నుంచి 3000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారు. ఏడు అంశాలపై చర్చలు జరుగుతాయి – ట్రేడ్, ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ట్రీయలైజేషన్, సస్టెయినబులిటీ అండ్ క్లైమెట్ యాక్షన్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, గ్రోత్, జియో ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్, ఇంక్లూజన్.

రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను సీఎం వివరిస్తారు. సదస్సు వేదికగా కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయి. విజయవాడ-సింగపూర్ నేరు విమాన సర్వీసులపై ఎంఓయూ కుదురనుంది. జపాన్ అంబాసిడర్ ఓనో కెలిచీతో సీఎం భేటీ అయ్యారు.

మధ్యాహ్నం ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సెషన్‌లో సీఎం ప్రసంగిస్తారు. బీపీసీఎల్, గోయొంకా, ఎస్బీఎఫ్ ప్రతినిధులతోనూ భేటీ. మంత్రి లోకేష్ యాక్షన్ టెసా, బ్లూ జెట్ హెల్త్ కేర్, జేమ్స్ కూక్ యూనివర్శిటీ, డిక్సన్ టెక్ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

తొలి రోజు ముగింపులో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

Read More
Next Story