’10వేల మందికి ప్రమోషన్లు కల్పించా‘
x

’10వేల మందికి ప్రమోషన్లు కల్పించా‘

అవినీతి రహిత గ్రామీణ పాలనే లక్ష్యంగా ద్యోగులతో 'మాటా - మంతి' నిర్వహించినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.


పంచాయతీరాజ్, దాని అనుబంధ శాఖల్లో 2లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, పవి వేల మందికి ప్రమోషన్లు కల్పించామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. అధికారులు, ఉద్యోగుల సిన్సియారిటీ, సీనియారిటీలతో పాటు వారి పనితీరు వంటి అంశాల ఆధారంగా పదోన్నతులు కల్పించినట్లు పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. బుధవారం నాడు మంగళగిరిలో కీలక సమావేశం నిర్వహించారు. శాఖ పరిధిలోని ఉద్యోగులు, అధికారులతో కలిసి "మాటా - మంతి" పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గ్రామీణ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు.

పదోన్నతులు పొందిన ఉద్యోగులు, అధికారుల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు. అయితే ఇంకా చేయాలని ఉందని, జీతాలు కూడా పెంచాలని ఉందని, కాకపోతే జీతాలు పెరగాలంటే ఆదాయం పెరగాల్సి ఉందని, అయినా దీనిపైన దృష్టి పెడుతామని, ఆదాయం పెంచడానికి అవసరమైన తీసుకోవడంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పంచాయతీరాజ్ వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదన్నారు. గ్రామస్థాయిలో ఎటువంటి అవినీతి కార్యకలాపాలకు తావులేకుండా, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులను ఆదేశించారు. నిధుల సకాలంలో విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి మంజూరవుతున్న నిధులను సకాలంలో విడుదల చేస్తున్నామని, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. పారదర్శకతే ముఖ్యం అని అన్నారు. ప్రతి పనిలోనూ పారదర్శకత పాటించాలని, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ పథకాలు, పారిశుధ్యం వంటి కీలక అంశాలపై ఉద్యోగుల నుంచి నేరుగా అభిప్రాయాలు, సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. నూతన ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలని, గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశం ద్వారా పవన్ కల్యాణ్ తన పంచాయతీరాజ్ శాఖలో నూతన ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు.
Read More
Next Story