అభివృద్ధి పదానికి అడ్రస్‌ దొరికి నేటికి 30 ఏళ్లట
x

అభివృద్ధి పదానికి అడ్రస్‌ దొరికి నేటికి 30 ఏళ్లట

సీఎం చంద్రబాబుకు ఆ పార్టీ నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు మీద ఆ పార్టీ నాయకులు అభినందన జల్లు కురిపిస్తున్నారు. 1995 సెప్టెంబరు 1న నాడు ఉమ్మడి రాష్ట్రంలో మొదటి సారిగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి సోమవారం నాటికి 30 ఏళ్లు.


ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు సీఎం చంద్రబాబును ఓ రేంజ్‌లో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్‌ మీడియాలో అయితే ఏకంగా అభివృద్ధి అనే పదానికి అడ్రస్‌ దొరికి నేటికి 30 ఏళ్లు అంటూ భారీ పోస్టు పెట్టి చంద్రబాబుపై తమ భక్తిని చాటుకున్నారు. దీంతో పాటుగా ౩౦ ఏళ్ల క్రితం చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫొటోను కూడా షేర్ చేశారు.

ఇంకా ఏమని పోస్టులు పెట్టారంటే..
నేటి ‘పీ–4‘కు ఆదర్శం, నాటి ‘జన్మభూమి’
'తరలుదాం రండి మనం జన్మభూమికి.. తల్లిపాల రుణం కొంత తీర్చడానికి..’ అంటూ ప్రతి ఒక్కరూ జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో 1997 జనవరి 1న చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ కార్యక్రమం ఎన్నో పల్లెల్లో వెలుగులు తీసుకొచ్చింది. ప్రవాసాంధ్రులను సైతం కదలించి జన్మభూమికి సేవ చేసేలా చేసింది.. ప్రజల వద్దకు పాలన’ అంటూ పేర్కొన్నారు.

ఇంకా వాటిని కొనసాగిస్తూ..
నిన్నకాక మొన్న ‘ప్యాలెస్‌ పాలన‘ చూశాం.. కానీ లేట్‌ 90’ లోనే ‘ప్రజల వద్దకు పాలన’ అంటూ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు , ప్రజల వద్దకే పాలనను తీసుకుని వెళ్లారు. అప్పటి వరకు కార్యాలయాలకే పరిమితమైన అధికారులను ప్రజల వద్దకు పంపి.. వారి సమస్యలను తెలుసుకోవడం, వివిధ పథకాల కింద లబ్ధిదారులను గుర్తించడం కోసం చేపట్టిన ‘ప్రజల వద్దకు పాలన’ జనాదరణ పొందింది.
1995 సెప్టెంబర్‌ 1న చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. 30 ఏళ్లుగా సంపద çసృష్టి, సంస్కరణలు, దార్శనికత, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం అన్న పదాలకు నిర్వచనంగా నిలిచారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు.
అరో అడుగు ముందుకేసి..
తెలుగు నేల గర్వించే నాయకుడు..
తెలుగు రాష్ట్రాల ప్రగతి కారకుడు..
దేశం స్మరించే దార్శనికుడు..
యువతకు భవిష్యత్తు చూపిన మార్గదర్శి..
ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్ళిన ఆద్యుడు
పేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు
మన చంద్రబాబు నాయుడు..
తొలి సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రజా సంకల్పమే శ్వాసగా, రాష్ట్ర ప్రగతినే లక్ష్యంగా పెట్టుకున్న విజనరీ నేతకు అభినందనలు అంటూ పోస్టులు పెట్టారు. నాడు చంద్రబాబు చేపట్టిన ప్రజల వద్దకు పాలన ఫొటోలను కూడా షేర్ చేశారు.
Read More
Next Story