హద్దులు దాటితే.. కఠిన చర్యలు
x

హద్దులు దాటితే.. కఠిన చర్యలు

సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ కొత్త వ్యూహం..


గ‌త కొన్నేళ్ళుగా ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు, సోషల్ మీడియా వేదికలను తమ తమ పార్టీ ప్రచారాలకు ఉప‌యోగించుకున్నారు. తర్వాత క్రమంలో అవి వ్యక్తిగత విమర్శలు, పార్టీ ప్రత్యర్ధులపై తప్పుడు సమాచారం, వ్యక్తిగత దూషణలు మొదలైయాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేనంతగా సోషల్ మీడియా వేదికలపై కొంత మంది దాడులు, వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. పలు వివాదాస్పద వ్యవహారాలకు సోషల్ మీడియా వేదికైంది. చివరకు కేసులు నమోదు, జడ్జిలపైనా ఆరోపణలు, దర్యాప్తులు ఇలా అనేక దుష్ఫరిణామాలు చోటు చేసుకున్నాయి.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్రత్యర్ధి పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఒక కంట కనిపెడుతూనే దీని నియంత్రణను తాజాగా మరింత కఠినంగా చేయాలని నిర్ణయించింది. సోషల్ మీడియా దుర్వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1, 2025 న ఒక కీలక GO జారీ చేసింది. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికలపై నియంత్రణ, బాధ్యత, ఫేక్ వార్తలు, దుర్వినియోగం వంటి అంశాలపై కేంద్రీకృత మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడం ఈ GO లక్ష్యం.

సోషల్ మీడియా నియంత్రణ కోసం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్ర‌భుత్వం. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారధిలను నియమించింది. ఈ కమిటీ సోష‌ల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణ, తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్‌పై ఫోకస్ పెట్టనుంది.

వీలైనంత త్వరగా ఈ మంత్రుల బృందం ప్రపంచంలోనే ఇతర దేశాలు, రాష్ట్రాలు అనుసరిస్తున్న బెస్ట్ ప్రాక్టీస్ ని పరిశీలించి సోషల్ మీడియా నియంత్రణపై కొత్త చట్టాలను అమలులోకి తీసుకురావాలన్నది ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. అవసరమైతే నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు సిఫారసు చేసే అధికారం మంత్రుల కమిటీకి ఉంటుంది.

Read More
Next Story