“కాంగ్రెస్ ను రద్దు చేయాలని కొండా వెంటకప్పయ్య ఎపుడో చెప్పారు”
x

“కాంగ్రెస్ ను రద్దు చేయాలని కొండా వెంటకప్పయ్య ఎపుడో చెప్పారు”

కాంగ్రెస్ లో కొండా వెంకటప్పయ్యకు తగిన గుర్తింపు రాలేదు: గుంటూరు లో బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ కామెంట్


మహాత్మా గాంధీ తలపెట్టిన ఎన్నో ఉద్యమాల్లో కొండా వెంకటప్పయ్య బాపూజీ కీలకపాత్ర పోషించారని అయితే, ఆయనకు ఇతర స్వాతంత్య్ర సమరయోధులకు వచ్చినంతపు గుర్తింపు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గుర్తు చేశారు. దీనికి కారణం కొండవెంకటప్పయ్య కాంగ్రెస్ లో పతనమయిన విలువలను ఎత్తిచూపడమేనని మాధవ్ అన్నారు.

గుంటూరు జిల్లాకు కొండావెంకటప్పయ్య గర్వకారణమని, ఆయన స్ఫూర్తితో ఇపుడు రాష్ట్రాభివృద్ధికి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

‘దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో కొండా వెంకటప్పయ్య, బాపూజీ ప్రముఖులని ఆయన గుంటూరు చెందిన వ్యక్తి కావడం మన అదృష్టం,’ అన్నారు. దేశంలో స్వాతంత్ర సమరయోధులందరికీ దక్కినటువంటి గౌరవం కొండ బాపూజీకి దక్కలేదన్నారు. మన తెలుగు ప్రజలంతా ఆయన కీర్తిని దశ దిశలా వ్యాపింప చేయాలని కోరారు.

మంగళవారం నాడు మాధవ్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో జిల్లాకు చెందిన నాటి ప్రముఖ స్వాతంత్య్రయోధుడు, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర ఉద్యమకారుడు కొండా వెంకటప్పయ్య పంతులును గుర్తు చేయడం విశేషం.

‘దేశభక్త’ కొండా వెంకటపయ్య పంతులు

నిజానికి ఆయనను కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజలుకూడా విస్మరించిన కాలమిది. కొండా వెంకటప్పయ్య (ఫిబ్రవరి 22, 1866 - ఆగష్టు 15, 1949) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుల్లో ఒకరు. 1866, ఫిబ్రవరి 22 న పాత గుంటూరులో కొండా వెంకటప్పయ్య జన్మించాడు. ప్రాథమిక విద్య గుంటూరు మిషన్ స్కూలులో, ఉన్నత విద్య మద్రాసు క్రైస్తవ కళాశాలలో పూర్తిచేసి తరువాత బి.ఎల్. పట్టా పొంది, బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. గాంధీజీ ప్రేరణతో ఆయన స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీకి చాలా సన్నిహితులయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయనతో సన్నిహితంగా పనిచేసిన కొద్ది మందిలో పంతులు గారు ఒకరు. ఆయన మెల్లిగా ఆయనకు కాంగ్రెస్ మీద నమ్మకం సడలింది. ఆయన్ని గాంధీజీ ‘దేశభక్త’ అని పలిచాడు.

సాతంత్య్రం సిద్ధించింది కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ రద్దు చేయడం మంచిదని ఆయన స్వయంగా మహాత్మాగాంధీకి లేఖ రాశారు. అందులో కాంగ్రెస్ వాళ్లలో ఆదర్శాలు మాయమయ్యాయి. అంతా అధికారంలో పాకులాడుతున్నారు. కాంగ్రెస్

“దేశంలోని స్త్రీ పురుషులంతా స్వాతంత్ర్యావేశంతోనే మీ నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకు వచ్చారు. ఇపుడు ఆ లక్ష్యం సాధించడం జరిగింది.ఈ మహుఉద్యమంలో పాల్గొన్న యోధులలో నైతిన విలువలు కాపాడుకోవడాలన్నకట్టుబాట్లు తెగిపోయాయి.... ప్రతి రోజు పరిస్థితి భరించలేని అధ్వాన్నంగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వే బాగుండేదని ప్రజలుఅంటున్నారు,” వెంకటప్పయ్య పంతులు లేఖలో రాశారు.

ఇలాంటి కొండా వెంకటప్పయ్య ను గుర్తు చేస్తూ మాధవ్ గుంటూరు పర్యటన ప్రారంభించారు. కాంగ్రెస్ కు చెల్లిందని చెబుతూ 1947లోనే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఆయన చెప్పిన విషయాన్ని మాధవ్ గుర్తు చేశారు.

గుంటూరు జిల్లాలోని తన శోభాయాత్రలో భాగంగా మంగళవారం కొండ వెంకటప్పయ్య బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని కొండా వెంకటప్పయ్య బాపూజీ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విఫలమైందన్నారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక మాధవ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గతవారం ఆయన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించారు.

నాలుగో తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటను సందర్శించారు. అక్కడ సారధి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటున్న రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను ప్రశసించారు. అనంతరం టిడిపి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తో కలసి ఒక ర్యాలీలోపాల్గొన్నారు.

గుంటూరు బీజేపీ ఆధ్వర్యంలో భారీర్యాలీ...

బీజేపీ జెండాలతో గుంటూరు చిల్లీస్ సెంటర్ కాషాయ మయమైంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కు భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. గుంటూరు పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన పివిఎన్ మాధవ్ కు భాజపా జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతరావు ఆధ్వర్యంలో నగరంలోని చిల్లీస్ డాబా నుంచి శ్రీ కన్వెన్షన్ హాల్ వరకు పెద్ద ఎత్తున భాజపా నాయకులు కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చి మాధవ్ కు స్వాగతం పలికారు ఈ సందర్భంగా తీన్మార్ డబ్బులు గిరిజన సాంప్రదాయ నృత్యాలు పార్టీ జెండాలను చేత భూని హర్షద్వానాల నడుమ స్వాగతం పలికారు ద్విచక్ర వాహనాల ర్యాలీ ఆకట్టుకుంది జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు.


Read More
Next Story