ఆక్వా రైతుల కష్టాలకు ఎవరూ జవాబుదారు?
x

ఆక్వా రైతుల కష్టాలకు ఎవరూ జవాబుదారు?

రొయ్యలతో బతుకుతున్న రైతు… నేడు రోడ్డుపై కన్నీళ్లు కారుస్తున్నాడు!”


అమెరికా విధించిన 50% టారిఫ్‌తో ఆక్వా పరిశ్రమ కుదేలైంది. రైతుల రక్తం, చెమటతో నిలబడిన రంగం ఒక్కసారిగా కూలిపోతున్నా, ప్రభుత్వం మాత్రం నిశ్శబ్దం పాటిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సుమారు ౩ లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగం ట్రంప్ నిర్ణయం వల్ల ప్రభావితం అయ్యింది. ఇప్పటికే మార్కెట్ ధరలు పడిపోతూ ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆక్వా ఉత్పత్తులలో దేశంలోనే అగ్రగామి అయిన ఆంధ్రప్రదేశ్ తన ఎగుమతుల్లో 92 శాతం అమెరికాకే పంపుతోంది. గతేడాది దేశం నుండి 7.38 బిలియన్ డాలర్ల (రూ. 60,000 కోట్ల) ఎగుమతులు జరిగాయి. దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ రంగం ఎంత ప్రమాదంలో పడిందో!

అమెరికా ఆక్వా దిగుమతుల్లో భారత్ వాటా 40 శాతంగా ఉంది. తరువాతి స్థానాల్లో వియత్నాం, బంగ్లాదేశ్, చైనాలు ఉన్నాయి. భారత్ పై ప్రస్తుత అత్యధిక పన్నుల వసూలు వల్ల ఆ దేశాలు లాభ పడనున్నాయని విశ్లేషకుల అంచనా.

హ్యాచరీస్ పరిస్థితి

కేవలం ఒక నెలలోనే రూ.100 కోట్లకు పైగా నష్టం.యజమానులు రుణాల బారిన పడి కుటుంబాలతో ఆందోళనలో."ఇలా కొనసాగితే తలదాచుకోలేని స్థితి వస్తుంది" అంటున్నారు.

రైతుల వేదన

గిట్టుబాటు లేకుండా రొయ్యలు అమ్మకాలు.ఫీడ్ ధరలు, కరెంటు బిల్లులు ఆకాశాన్ని తాకి ఉత్పత్తి ఖర్చులు మింగేస్తున్నాయి.రుణ భారం పెరిగి "ఆత్మహత్యల ఆలోచనల్లోకి వెళ్తున్నాం" అంటున్నారు రైతులు.

ఉపాధి మీద దెబ్బ

20 లక్షల మందికి పైగా నేరుగా ఆధారపడిన రంగం. పరిశ్రమ కుప్పకూలితే వేలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయి.యువత నిరుద్యోగంతో రోడ్డున పడే ప్రమాదం.

ప్రభుత్వం స్పందించకపోతే

ఆక్వా రంగం పూర్తిగా కూలిపోతుంది.రైతులు, హ్యాచరీ యజమానులు బట్టలు బట్టలేకుండా పోతారు.ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత రగిలే అవకాశముంది.

రైతుల డిమాండ్లు

హ్యాచరీస్‌కు కరెంట్ చార్జీలు తగ్గించాలిఫీడ్ రేట్లపై కఠిన నియంత్రణఎగుమతులకు సబ్సిడీలుప్రత్యేక ప్యాకేజ్ వెంటనే ప్రకటించాలిరైతుల కష్టాలు చూసి కూడా మౌనం పాటిస్తున్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొంటుందా?రొయ్య రైతు రక్తం విలువ కాని ఈ పరిస్థితి ఆక్వా రంగాన్ని శాశ్వతంగా కూల్చేస్తుందేమో అనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

Read More
Next Story