విజయవాడలో డ్రగ్స్‌ కలకలం
x

విజయవాడలో డ్రగ్స్‌ కలకలం

గుట్టు చప్పుడు కాకుండా ట్రావెల్స్‌లో తరలిస్తున్న ఇద్దరి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో తరచుగా డ్రగ్స్‌ అంశం తెరపైకి వస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా అక్రమార్కులు డ్రగ్స్‌ను తరలింపులకు పాల్పడటంతో పాటు వాటిని విక్రయిస్తూ సోమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే గురువారం విజయవాడలో చోటు చేసుకుంది. అయితే పోలీసులు చాకచక్యంతో వ్యవహరించి దీనిని రట్టు చేశారు. కళ్లు గప్పి తరలిస్తున్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తరలింపులకు పాల్పడుతున్న ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

బెంగుళూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లు విజయవాడ పోలీసులకు సమచారం అందింది. దీంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్‌ బృందం రంగంలోకి దిగింది. విజయవాడ మహానాడు జంక్షన్‌ వద్ద ఈగల్‌ అధికారులు నిఘా ఉంచి ఆ బస్సు కోసం కాపు కాశారు. ఎట్టకేలకు వచ్చిన ఈ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఆపి తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు.
Read More
Next Story