Agitation : | పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష ఎంపీల నిరసన
"మోదీ, అదానీ ఏక్ హై" - "అదానీ సేఫ్ హై" అని రాసిన కోట్లను ధరించి ప్రతిపక్ష ఎంపీలు కనిపించారు.
పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష ఎంపీల నిరసనభారత వ్యాపార దిగ్గజం గౌతం అదానీపై ఇటీవల అమెరికాలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. గ్రీన్ ఎనర్జీ కాంట్రాక్టుల కోసం అధికారులకు లంచాలు ఇవ్వజూపారన్న అభియోగాలపై ఆయనపై అగ్రరాజ్యంలో కేసు నమోదైంది. దీనిపై చర్చ జరగాలని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) డిమాండ్ చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సభలో మాట్లాడాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు, ఆర్జేడీ, ఇతర ప్రతిపక్షాల ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. తొలుత పార్లమెంటు మకర ద్వార్ మెట్ల ముందు, కొద్దిసేపటి తర్వాత సంవిధాన్ సదన్ ముందు బైఠాయించారు. "మోదీ, అదానీ ఏక్ హై" - "అదానీ సేఫ్ హై" అని రాసిన కోట్లను ధరించి కనిపించారు.
పార్లమెంటు గేట్ల ముందు నిరసన తెలపడం వల్ల మిగతా పార్లమెంటేరియన్లకు ఆటంకం కలుగుతుందని, వారి భద్రతపై ప్రభావం చూపుతుందని స్పీకర్ ఓంబిర్లా సూచించడంతో మంగళ, బుధవారాల్లో విపక్ష ఎంపీలు మకర ద్వార్ మెట్లపై నిరసన చేపట్టారు. అయితే అదానీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీలు పాల్గొనలేదు.