నటుడు సిద్ధిక్‌కు బెయిల్ నిరాకరణ - లుకౌట్ నోటీసు జారీ
మలయాళ సినీ నటుడు సిద్ధిక్‌కు కోర్టులో చుక్కెదురైంది. తనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఒక నటి ఫిర్యాదు ఆధారంగా సిద్ధిక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మలయాళ సినీ నటుడు సిద్ధిక్‌కు కోర్టులో చుక్కెదురైంది. తనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఒక నటి ఫిర్యాదు ఆధారంగా సిద్ధిక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ముందస్తు బెయిల్ కోసం ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో అరెస్టు తప్పదనుకున్న నటుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇటు పోలీసులు ఆయనపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసినట్లు సమాచారం.
నటి అయిన బాధితురాలు తనను 2019 నుంచి వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించడంతో సిద్ధిక్‌పై పోలీసులు సెక్షన్ 376 (రేప్), 506 (నేరపూరిత బెదిరింపు)సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే 2016 నుంచి నిరాధార ఆరోపణలతో తనను ఇబ్బందిపెడుతోందని సిద్ధిక్ తన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు.
న్యాయం గెలిచింది..
కోర్టు తీర్పుపై బాధితురాలు స్పందించారు. “సిద్ధిక్‌కు బెయిల్ నిరాకరించడం సంతోషిచదగ్గ విషయం. ఆలస్యమైనా చివరికి న్యాయం గెలుస్తుందని నేను నమ్ముతున్నాను.’’ అని తెలిపారు.కాగా తనపై వచ్చిన ఆరోపణలతో మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) జనరల్ సెక్రటరీ పదవికి సిద్ధిక్ రాజీనామా చేశారు.
హేమా కమిటీ నివేదిక..
జస్టిస్ కె హేమ కమిటీ నివేదికలో వెల్లడైన నేపథ్యంలో వివిధ దర్శకులు, నటీనటులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పలువురు ప్రముఖ మలయాళ సినీ ప్రముఖులపై పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 2017 నటిపై దాడి కేసు, మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు, దోపిడీకి సంబంధించిన ఉదంతాలను వెల్లడి చేసిన తర్వాత కేరళ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.