పరందూర్ ఎయిర్‌పోర్ట్‌ ఆందోళనకారులను కలపనున్న TVK అధ్యక్షుడు విజయ్
x

పరందూర్ ఎయిర్‌పోర్ట్‌ ఆందోళనకారులను కలపనున్న TVK అధ్యక్షుడు విజయ్

తమిళనాడు పరందూర్ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా గత కొన్ని నెలల నుంచి సమీప గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు


తమిళనాడు పరందూర్ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా గత కొన్ని నెలల నుంచి సమీప గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భూముల స్వాధీనాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. వీరిని జనవరి 20వ తేదీ తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ (Vijay) కలవనున్నారు. కాన్చీపురం జిల్లాలోని ఎకనాపురం గ్రామాన్ని ఆయన సందర్శిస్తారు.

చెన్నై విమానాశ్రయానికన్నా భిన్నంగా నగరానికి రెండో విమానాశ్రయం కాంచీపురం జిల్లా పరందూరు పరిధిలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త విమానాశ్రయాన్ని రూ.20వేల కోట్లతో తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ(టిడ్కో) నిర్మించనుంది. విమానాశ్రయ నిర్మాణానికి 13 గ్రామాల పరిధిలో 4563.56 ఎకరాల స్థలం అవసరం. భూములు ఇచ్చేవారికి స్థానిక మార్కెట్ విలువకన్నా 3.5 రెట్లు ఎక్కువగా నష్టపరిహారం, పునరావాసం, ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Read More
Next Story