యాక్టింగ్‌ కోసం  ఐఏఎస్‌ కు రాజీనామా చేసిన అధికారి
x

యాక్టింగ్‌ కోసం ఐఏఎస్‌ కు రాజీనామా చేసిన అధికారి

నటనంటే ఆయన ప్రాణం. చివరకు తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధమైన ఆ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఎవరంటే..


సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ అధికారి కావాలన్నది లక్షలాది విద్యార్థుల ఆకాంక్ష. అయితే ఐఏఎస్‌ అభిషేక్‌ సింగ్‌ కథ ఇందుకు భిన్నం. చాలా ప్రయత్నాల తర్వాత ఐఏఎస్‌ అధికారి కాగలిగారు. తరువాత నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తన పోస్టుకు రాజీనామా చేశాడు. 27 ఏళ్ల సర్వీసును తృణప్రాయంగా వదులుకున్నాడు.


ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన అభిషేక్‌ చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థి కాదు. తన పాఠశాల విద్య తరువాత, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బి.కాం పట్టా పొందాడు. అనంతరం సివిల్స్‌పై దృష్టి పెట్టాడు. చాలా ప్రయత్నాల తర్వాత 2010లో లక్ష్యాన్ని సాధించాడు. 2011లో ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (ఐఏఎస్‌)లో చేరాడు. దాదాపు 10 సంవత్సరాలు ఐఏఎస్‌గా పనిచేశాడు. 2022లో గుజరాత్‌లో జరిగిన ఎన్నికలకు ఆయనను అబ్జర్వర్‌గా నియమించారు. ఆ సందర్భంలో ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఫొటో ఒకటి వైరలైంది. దీంతో 2023లో ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్‌ చేశారు.


తరువాత ఆయన తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. గత నవంబర్‌లో తన రిసిజ్నేషన్‌ పేపర్లను ఉన్నతాధికారులను పంపారు.




విమర్శకుల నుంచి ప్రశంసలు..


ఇక నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుని.. మ్యూజిక్‌ వీడియోలు, వెబ్‌ సిరీస్‌లో నటించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన వెబ్‌ సిరీస్‌ ‘ఢల్లీి క్రైమ్‌’లో అభిషేక్‌ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు. ‘చార్‌ పంద్రా’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో కూడా కనిపించాడు. ప్రముఖ పంజాబీ గాయకుడు బి ప్రాక్‌ పాడిన ‘దిల్‌ తోడ్‌ కే’ పాటలో అద్భుతమైన పర్మామెన్స్‌ ఇచ్చాడు. ఆ పాట చాలా పెద్ద హిట్‌ అయింది.


ఇటీవల బిగ్‌బాస్‌ కార్యక్రమంలో సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, సన్నీ లియోన్‌తో కలిసి కనిపించాడు. అభిషేక్‌, సన్నీ ఇద్దరూ తమ రాబోయే సినిమాను ప్రమోట్‌ చేయడానికి బిగ్‌ బాస్‌కు వచ్చారు.


చత్తీస్‌గఢ్‌కు చెందిన ఐఏఎస్‌ దుర్గా శక్తి నాగ్‌పాల్‌ను అభిషేక్‌ పెళ్లి చేసుకున్నాడు. బి.టెక్‌ చదివిన నాగ్‌పాల్‌ యూపీఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆల్‌ ఇండియా స్థాయిలో 20వ ర్యాంకుతో ఐఏఎస్‌ కేడర్‌లోకి ప్రవేశించారు.


33 ఏళ్ల అభిషేక్‌ సింగ్‌కు సోషల్‌ మీడియాలో వేలమంది ఫాలోవర్స్‌ ఉండడం విశేషం. అభిషేక్‌ తండ్రి అఖిలేష్‌ సింగ్‌. ఉత్తర్‌ ప్రదేశ్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి.

Read More
Next Story