Delhi Politics | AAP చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బంపరాఫర్..
x

Delhi Politics | AAP చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బంపరాఫర్..

‘‘మమ్మల్ని గెలిపిస్తే మేల్ స్టూడెంట్స్‌కు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కలిస్తాం. మెట్రోట్రైన్‌ చార్జీలో సగం మేమే భరిస్తాం.’’ - అరవింద్ కేజ్రివాల్.


ఢిల్లీ (Delhi)అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో..బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. దీనికి కొన్ని గంటల ముందు కేజ్రీవాల్ ఓటర్లకు మరో ఆఫర్‌ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సులో మేల్ స్టూడెంట్స్ కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. అలాగే మెట్రో ట్రైన్‌ ఛార్జీలో 50 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు. ఢిల్లీలో ఇప్పటికే ఆప్ సర్కార్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే.

ఆర్థిక భారం తగ్గించాలనే..

"ఢిల్లీ మహిళలు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మేల్ స్టూడెంట్స్‌కు దాన్ని వర్తింపజేస్తాం. ఇలా చేయడం వల్ల వారి కుటుంబానికి కొంత ఆర్థిక భారం తగ్గుతుంది. అలాగే మెట్రోచార్జీలో సగం చార్జీ మేమే భరిస్తాం. ఎలక్షన్ కోడ్ కారణంగా దీన్ని ఇప్పటికి ఇప్పుడు అమల్లోకి తేవడం సాధ్యపడదు. గెలిపించిన వెంటనే అమలు చేస్తాం," అని కేజ్రివాల్ చెప్పారు.

"ఇంతకుముందు కూడా నేను ఇదే చెప్పాను. కానీ ఈ రోజు నేను అధికారిక ప్రకటన చేస్తున్నా. అసెంబ్లీ ఎన్నికల తర్వాత AAP తిరిగి అధికారంలోకి వస్తే.. అధికంగా వచ్చిన బిల్లులను మాఫీ చేస్తాం. బిల్లులు తప్పుగా వచ్చాయని భావిస్తే వాటిని చెల్లించనవసరం లేదు" అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.

ఆప్ ఇప్పటికే ఇచ్చిన హామీలు..

- మహిళా సమ్మాన్ యోజన పథకం కింద మహిళలకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.1,000 నుంచి రూ.2,100కి పెంపు

- 'సంజీవని యోజన' కింద 60 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య భీమా

- ‘పూజారి గ్రంథి సమ్మాన్ యోజన’ కింద పూజారులకు గౌరవ వేతనంగా నెలకు రూ. 18 వేలు.

- ఆటోరిక్షా డ్రైవర్లకు రూ.15 లక్షల ప్రమాద బీమా, వారి కూతుర్ల పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం, ఏడాదికి రెండుసార్లు యూనిఫాం భత్యం

- అధికంగా వచ్చిన వాటర్ బిల్లుల మాఫీ

- రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్(ఆర్‌డబ్ల్యూఏ) ద్వారా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల నియామకానికి నిధులు మంజూరు

ప్రధాని మోదీ లేఖ..

బీజేపీని ఇరుకునే పెట్టే లక్ష్యంతో ఉన్న కేజ్రీవాల్.. ప్రధాని మోదీ(PM Modi)కి లేఖ రాశారు. అందులో ఢిల్లీ మెట్రోలో విద్యార్థుల చార్జీలో మిగతా సగాన్ని కేంద్రం భరించాలని కోరారు.

ఢిల్లీలో పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది. కౌంటింగ్ 8న ఉంటుంది.

Read More
Next Story