
బీహార్‌లో 65 లక్షల మంది ఓటర్ల తొలగింపు
S.I.R అనంతరం 7.89 కోట్ల నుంచి 7.42 కోట్లకు - EC వెల్లడి
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్(Bihar)లో.. ఎన్నికల సంఘం(EC) ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (S.I.R) చేపట్టిన విషయం తెలిసిందే. ఎస్ఐఆర్ నిర్వహణకు ముందు 7.89 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మంగళవారం ప్రచురించిన తుది ఓటరు జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు తగ్గింది. 65 లక్షల మంది ఓటర్లను వివిధ కారణాలతో జాబితా నుంచి తొలగించారు. అందులో చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, రెండు చోట్ల ఓటరు కార్డు కలిగిఉన్నవారు ఉన్నారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం 3.66 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించగా..21.53 లక్షల మందిని చేర్చినట్లు EC పేర్కొంది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అధికార బీజేపీ(BJP) ఆదేశాల మేరకు ఎన్నికల పర్యవేక్షణ సంస్థ పనిచేస్తోందని ఆరోపిస్తున్నాయి.
Next Story