
కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్, బుమ్రా
మాంచెస్టర్ టెస్ట్ కు బుమ్రా అందుబాటులో ఉండట్లేదా?
జట్టుకు భారమవుతున్నాడని ఓ వర్గం వాదన, ఉదాహారణగా చూపుతున్న గణాంకాలు
అభిజిత్ సింగ్ భంబ్రా
భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెండూల్కర్- అండర్సన్ ట్రోఫిలో ఇప్పటికే మూడు టెస్ట్ లు పూర్తయ్యాయి. భారత్ సిరీస్ లో 1-2 తో వెనకబడి ఉంది. కానీ ఇప్పటికీ తుది జట్టు ఎంపిక ప్రక్రియలో భారత్ సందిగ్థతను ఎదుర్కొంటోంది.
జస్ప్రీత్ బుమ్రా మొదటి, మూడో టెస్ట్ లో తుది జట్టులో ఉండగా, జట్టు ఓటమి పాలైంది. కానీ భారత్ ఇప్పుడు మళ్లీ సిరీస్ లో ఫుంజుకోవాలంటే బూమ్రా కచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాలా, లేదా బర్మింగ్ హమ్ లో లాగా విశ్రాంతి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి.
బూమ్రా రికార్డు ఎలా ఉందంటే..
బూమ్రా 2018 లో టెస్ట్ మ్యాచ్ లు అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకూ 47 టెస్ట్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో భారత్ 20 గెలిచి, 23 ఓడిపోయింది. కేవలం నాలుగు మాత్రమే డ్రాగా ముగిశాయి. బుమ్రా ప్లేయింగ్ 11 లో ఉండటంతో మన విజయశాతం 43శాతంగా ఉంది.
అయితే బుమ్రా లేని సమయంలో 19 టెస్టుల్లో నెగ్గిన టీమిండియా, ఐదు మాత్రమే ఓటమి పాలైంది. అంటే బుమ్రా లేని సమయంలో భారత విజయం రేటు 71 శాతంగా ఉంది. బుమ్రా నిజంగా ఆశించిన ప్రభావం చూపుతున్నాడా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది.
ప్రస్తుతం సిరీస్ లో బుమ్రా హెడింగ్లీ, లార్డ్స్ లో తుది జట్టులో ఆడినప్పటికీ మనం ఈ మ్యాచుల్లో ఓటమి పాలైయ్యాం. అతనికి విశ్రాంతి ఇచ్చిన బర్మింగ్ హమ్ టెస్ట్ లో 336 పరుగుల తేడాతో విజయం సాధించాము.
అవే ఆజ్యం పోశాయా?
బుమ్రా విదేశీ రికార్డు ఈ చర్చలకు మరింత ఆజ్యం పోసింది. అతను ఆడిన 47 టెస్టులలో 35 విదేశాల్లోనే ఆడాడు. వాటిలో ఇండియా 12 గెలిచి, 19 ఓడిపోయింది. బుమ్రా జట్టులో ఉండటం వలన మన గెలుపు అవకాశాలు 34 శాతం మాత్రమే. ఈ పేస్ బౌలర్ లేకుండా తొమ్మిది ఆడగా, అందులో ఐదు గెలిచారు.
మూడు మాత్రమే ఓటమి పాలయ్యారు. కాబట్టి మాంచెస్టర్ టెస్ట్ కు ముందు ఈ గణాంకాలను చూపెట్టి అతనికి విశ్రాంతి ఇవ్వాలని కొంతమంది వాదిస్తున్నారు. కానీ గణాంకాలు కొన్ని సార్లు మాయ చేస్తాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
సంఖ్యలకు మించి..
కర్ణాటక మాజీ క్రికెటర్ దీపక్ చౌగులే మాట్లాడుతూ.. బుమ్రా విలువను కేవలం మ్యాచ్ ఫలితాల ద్వారా మాత్రమే అంచనా వేయలేమని వాదించాడు.
‘‘బుమ్రా ఆడతాడ లేడా అనే దానితో సంబంధం లేకుండా అతను ప్రభావవంతమైన ఆటగాడు కాబట్టి అది చాలా పెద్ద తేడా ఉంటుందని నేను భావిస్తున్నాను’’ అన్నారు. అవకాశం ఇస్తే మార్పు తీసుకువచ్చే ఇతర బౌలర్లు కూడా ఉన్నారని ఆయన భావించారు.
బుమ్రా పనిభారాన్ని నిర్వహించడంలో జట్టు జాగ్రత్తగా వ్యవహరించడాన్ని కూడా ఆయన సమర్థించాడు. తన శరీరాన్ని అర్థం చేసుకుని, సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అతని స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. ఒక పేస్ బౌలర్ బ్రేక్ డౌన్ అయితే అది జట్టు పై పడుతుందని వ్యాఖ్యానించారు.
మాంచెస్టర్ లో..
ఐదు టెస్ట్ ల సిరీస్ లో భారత్ 1-2 తో వెనకబడి ఉంది. మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటారు. మిగిలిన రెండు టెస్ట్ లలో బుమ్రా ఒక మ్యాచ్ లో మాత్రమే ఆడతాడని జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పుడందరి దృష్టి కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ పైనే ఉంది.
వారు ఓల్డ్ ట్రాఫోర్డ్ లో బుమ్రాను ఆడిస్తారా? లేక ఓవల్ వరకు వేచి చూస్తారా ? అనే ఎవరికి అర్థం కావడం లేదు. రాబోయే కొన్ని రోజులు సిరీస్ భవితవ్యాన్ని మాత్రమే కాకుండా భారత్ అత్యంత నిగూఢమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకరి వారసత్వాన్ని కూడా నిర్ణయిస్తాయి.
Next Story