రేపే ఐపీఎల్ 2024 ఫైనల్.. అక్కడ వాతావరణం ఎలా ఉందంటే..
x

రేపే ఐపీఎల్ 2024 ఫైనల్.. అక్కడ వాతావరణం ఎలా ఉందంటే..

ఐపీఎల్ 2024 తన తుది ఘట్టం ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో మరోసారి ఈ రెండు జట్లు..


ఐపీఎల్ 2024 తన తుది ఘట్టం ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో మరోసారి ఈ రెండు జట్లు ఫేవరెట్స్‌గానే నిలిచాయి. తొలి క్వాలిఫయర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన కేకేఆర్ మరోసారి ఫైనల్‌లో కూడా ఆరెంజ్ ఆర్మీతో యుద్ధం చేయనుంది. తన కమ్‌బ్యాక్‌తో ఎస్‌ఆర్‌హెచ్ ఈసారి టైటిల్ తనదే అన్న నమ్మకాన్ని ఫ్యాన్స్‌లో బలపరిచింది. ఈ రెండు జట్ల మధ్య పోరు ఆదివారం చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియం వేదికగా జరగనుంది. అయితే ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారడం క్రికెట్ ప్రేమికులను కలవరపెడుతోంది. వర్షం పడితే ఫైనల్ పరిస్థితి ఏంటి? వర్షం పడే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి? అన్ని మ్యాచ్‌లకు ఉన్నట్లే ఫైనల్‌కు కూడా రిజర్వ్ డే ఉందా? అన్న అనుమానాలు అధికం అవుతున్నాయి.

ఆదివారం రోజున చెన్నై వాతావారణం ఇలా

ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనున్న సందర్భంగా ఆదివారం చెన్నైలో వాతావరణం ఎలా ఉంటుంది అనేదే హాట్‌టాపిక్‌గా మారింది. జాతీయ వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం అయితే ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి నుంచి వచ్చిన ఇబ్బంది ఏమాత్రం ఉండదు. ఆదివారం అంటే మే 26వ తేదీన చెన్నైలో వర్షం పడదు కానీ అక్కడ వాతావరణం కాస్త చల్లగా మబ్బులు కమ్మి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు చెన్నైలో అత్యల్పంగా 29 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదవుతుందని సమాచారం. కాబట్టి కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌కు ఎదురులేదని చెప్పొచ్చు.

రిజర్వ్ డే ఉంటుందా

మనం అనుకున్నది అనుకున్నట్లే జరుగుతున్న గ్యారెంటీ ఎప్పుడూ ఉండదు. దీనిని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. అలానే వాతావరణ శాఖ వేసిన అంచనా తప్పి చెన్నైలో వర్షం పడితే మ్యాచ్ పరిస్థితి ఏంటి. రిజర్వ్ డే ఉంటుందా? అంటే తప్పకుండా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్ సహా అన్ని ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంటుందని, రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ రద్దయితే అప్పుడు వేరే ఆప్షన్ ప్రకారం విజేతను నిర్ణయిస్తామని బీబీసీ తెలిపింది. కాబట్టి ఫ్యాన్స్ భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ వర్షం వచ్చి ఫైనల్ రద్దయినా రిజర్వ్ డే తప్పకుండా ఉంటుంది.

రిజర్వ్ డే కూడా రద్దయితే..

ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా అంచనాలు తారుమారయ్యి మ్యాచ్ రద్దయితే.. కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య ఒక సూపర్ ఓవర్ మ్యాచ్ తప్పకుండా ఉంటుందని, దాని ఫలితాల ప్రకారం విజేతను నిర్ణయిస్తారని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. కానీ అందుకు ఎటువంటి ఆస్కారం లేదని, వాతావరణ శాఖ రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే చెన్నైలో ఆదివారం ఫైనల్ నిర్వహించడానికి బీసీసీఐ ఓకే చెప్పిందని బీసీసీఐ వర్గాలు వివరిస్తున్నాయి.

Read More
Next Story