కాంబ్లీకి ప్రతి నెలా ఆర్థిక సాయం అందజేస్తాం: గవాస్కర్ ఫౌండేషన్
x
వినోద్ కాంబ్లీ

కాంబ్లీకి ప్రతి నెలా ఆర్థిక సాయం అందజేస్తాం: గవాస్కర్ ఫౌండేషన్

ఈ నెల నుంచి ప్రతి నెల రూ. 30 వేలు ఆర్థిక సాయం, వైద్య సేవలకు అదనంగా మరికొంత మొత్తం


మద్యానికి బానిసై, అనారోగ్యంతో ఉన్న మాజీ క్రికెట్ ఆటగాడు వినోద్ కాంబ్లీని ఆదుకోవడానికి లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ముందుకు వచ్చాడు. తన ఫౌండేషన్ అయిన ‘గవాస్కర్ ఛాంప్స్ ’ ద్వారా నెలకు రూ. 30 వేలు అందిస్తానని ప్రకటించాడు.

అలాగే తన తన ఔషధాల కోసం సంవత్సరానికి అదనంగా మరో రూ. 30 వేలు అందజేస్తామని సైతం వెల్లడించారు. ఈ నెల నుంచి కాంబ్లీకి సాయం అందజేస్తానని ఫౌండేషన్ పేర్కొంది.

ఈ ఏడాది ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియం 50 వ వార్షికోత్సవం సందర్భంగా సునీల్ గవాస్కర్ అక్కడకు వచ్చాడు. ఇదే తరుణంలో అక్కడికి వచ్చిన గవాస్కర్ కాళ్లను కాంబ్లీ తాకడంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

గత ఏడాది డిసెంబర్ లో కాంబ్లీ అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలయ్యాడు. తన యూరినరీ వ్యవస్థ పూర్తిగా పాడవడంతో థానేలోని ‘ఆకృతి’ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.
ఈ ఆస్పత్రి యాజమాని కాంబ్లీకి అభిమాని కావడంతో కీలక చికిత్సలను ఉచితంగా అందించింది. డాక్టర్ శైలేష్ ఠాకూర్ స్వయంగా దగ్గర ఉండి చికిత్స అందించారు.
ప్రస్తుతం తనకు వచ్చిన సాయంపై కాంబ్లీ భార్య ఆండ్రియా స్పందించారు. స్వయంగా ఓ వీడియో చేసి గవాస్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాయంపై జాతీయ మీడియా గవాస్కర్ ను సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన మాట్లాడానికి నిరాకరించారు.
‘‘ కాంబ్లీకి సాయం చేయడానికి చాలా రోజుల నుంచి గవాస్కర్ సిద్దంగా ఉన్నారు. ఈ సంవత్సరం వాంఖడే లో జరిగిన ఆ సంఘటన తరువాత ఆయన కాంబ్లీకి వైద్యం అందిస్తున్న ఇద్దరు డాక్టర్లను స్వయంగా కలిశారు.
కాంబ్లీకి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్లుప్తంగా వివరించారు. గవాస్కర్ ఛాంప్ ఫౌండేషన్ వెంటనే ఆర్థిక సాయం తో పాటు ఔషధాలు అందించే పనిని ప్రారంభించింది’’ అని గవాస్కర్ స్నేహితుడు అనిల్ జోషి చెప్పారు.
కాంబ్లీ.. భారత్ తరఫున 17 టెస్టులు ఆడాడు. ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాదేశాడు. అలాగే 104 వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
గవాస్కర్ ఫౌండేషన్ తరఫున సాయం అందుకున్న రెండో మాజీ భారత ఆటగాడు కాంబ్లీ. ఇంతకుముందు సలీమ్ దురానికి ఆయన సాయం అందించాడు.
కాంబ్లీకి అనారోగ్య సమస్య వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అందులో ఒకటి ఆగష్టులో బయటకు రాగా, మరొక వీడియో డిసెంబర్ వైరల్ అయింది.
దీనితో కాంబ్లీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారం, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలు హైలైట్ అయ్యాయి. అందులో ఒకటి సచిన్ షేక్ హ్యాండ్ ఇస్తూ చేయి విడవడానికి నిరాకరించాడు.
వీరు ఇద్దరు స్కూల్ క్రికెట్ నుంచే స్నేహితులు. ముంబాయి శివాజీ పార్క్ లోని ప్రముఖ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ దగ్గర క్రికెట్ ఓనమాలు నేర్చుకుని సంచలనాలు సృష్టించారు.
కానీ కాంబ్లీ క్రికెట్ కన్నా ఎక్కువగా బయట విషయాలపై దృష్టి పెట్టి చాలా తక్కువ కాలంలోనే తన ఫామ్ ను కోల్పోయి జట్టుకు దూరం అయ్యాడు. తరువాత మద్యానికి బానిసై తన క్రికెట్ కెరీర్ నాశనం చేసుకున్నాడు.


Read More
Next Story