ఎట్టకేలకు మౌనం వీడిన విరాట్ కోహ్లీ
x
విరాట్ కోహ్లీ

ఎట్టకేలకు మౌనం వీడిన విరాట్ కోహ్లీ

సంతోషం నిమిషాల్లోనే ఆవిరైందని ట్వీట్


ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూర్ లో జరిగిన తొక్కిసలాట , మరణాలపై విరాట్ కోహ్లీ స్పందించారు. జట్టు అత్యంత సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉందని పోస్ట్ చేశారు. ‘‘జీవితంలో ఇలాంటి హృదయ విచారకర విషాదాన్ని స్వీకరించడానికి ఎవరూ సిద్దం కారు’’ అన్నారు.

ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ వేడుకను జరుపుకోవడానికి చిన్నస్వామి స్టేడియంకి చేరుకున్నప్పుడూ 2.5 లక్షల మంది ప్రజలు గుమిగూడగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
‘‘జీవితంలో జూన్ 4 లాంటి హృదయ విచారకర విషాదాన్ని స్వీకరించడానికి సిద్దం కాదు. మా ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత సంతోషకరమైన క్షణం విషాదకరంగా మారింది.’’ అని కోహ్లీ ఆర్సీబీ తన అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేశారు.
మనం కోల్పోయిన వారి కుటుంబాల గురించి గాయపడిన మా అభిమానుల గురించి నేను ఆలోచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ నష్టం ఇప్పుడు మా కథలో భాగం. మేము జాగ్రత్తగా, గౌరవంగా, బాధ్యతతో ముందుకు సాగుతాము’’ అని కోహ్లీ వివరణ ఇచ్చారు.
ఆర్సీబీ అర్ధవంతమైన చర్య కోరుతోంది..
సరైన అనుమతులు తీసుకోకుండా ఆర్సీబీ నుంచి సోషల్ మీడియా ఆహ్వానాల వల్ల జనసమూహం అధికంగా ఉండటం వల్ల గందరగోళం ఏర్పడిందని అధికారిక విచారణ తరువాత తెలిపింది.
పోలీసులు వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అంగీకరించారు. అయితే దర్యాప్తులో అభిమానుల భారీ సమావేశాన్ని ప్రొత్సహించినందుకు ఫ్రాంచైజీనే బాధ్యురాలిగా చేశారు.
ఆర్సీబీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. వారి జ్ఞాపకార్థం అర్థవంతమైన చర్య తీసుకుంటామని హమీ ఇచ్చింది. ప్రాంచైజీ తన ఫౌండేషన్ ఆర్సీబీ కేర్స్ ను కూడా ప్రారంభించింది. ఇది మెరుగైన క్రౌడ్ మేనేజ్ మెంట్ ప్రోటో కాల్ లను అమలు చేయడానికి స్టేడియం అధికారులు, క్రీడా సంస్థలు లీగ్ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని హమీ ఇచ్చింది.


Read More
Next Story