ASIA CUP: సూపర్ ఓవర్ లో శ్రీలంకపై టీమ్ ఇండియా విజయం
x

ASIA CUP: సూపర్ ఓవర్ లో శ్రీలంకపై టీమ్ ఇండియా విజయం

భారత్, శ్రీలంక మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది


ఆసియా కప్‌లో సూపర్‌ 4లో భాగంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా టీమ్‌ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన నామమాత్రపు మ్యాచ్ అత్యంత ఉత్కంఠ రేపింది. ఫైనల్ మ్యాచ్ ను తలపించింది. భారత్ చేసిన భారీ స్కోరు 202 పరుగులను శ్రీలంక సునాయాసంగా ఛేదించడంతో మ్యాచ్ టై అయింది. ఇరు జట్లు సమానంగా స్కోర్ చేయడంతో ఫలితం తేల్చడానికి సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఈ సూపర్ ఓవర్ లో భారత బౌలర్ అర్షదీప్ వేశాడు. తొలిబాల్ వేశాడు. శ్రీలంక ఆటగాడు భారీ షాట్ కొట్టి అవుటయ్యారు. రెండో బాల్ కి ఒక పరుగు వచ్చింది. మూడో బాల్ కి మరో వికెట్ పడినట్టు ప్రకటించినా ఆ తర్వాత అది అవుట్ కాదని తేలింది. నాలుగో బాల్ కి మరో పరుగు వచ్చింది. నాలుగు బాల్స్ కి 2 పరుగులు వచ్చాయి. ఐదో బాల్ వేశాడు. భారీ షాట్ కొట్టి మరో శ్రీలంక ఆటగాడు అవుట్ అయ్యారు. దీంతో సూపర్ ఒవర్ లో శ్రీలంక 2 పరుగులు చేసినట్టయింది. టీమ్ ఇండియా టార్గెట్ 3 పరుగులుగా నిర్ణయించారు.


ఆతర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు సూర్యకుమార్, శుభమన్ గిల్ సూపర్ ఓవర్ ఆడేందుకు క్రీజ్ లోకి వచ్చారు. శ్రీలంక బౌలర్ వేసిన తొలిబంతికే విజయానికి కావాల్సిన మూడు పరుగులు చేసి విజయం సాధించారు. దీంతో శ్రీలంక సూపర్ ఓవర్ లో ఓడిపోయింది.

అంతకుముందు, ఆసియా కప్‌లో సూపర్‌ 4లో భాగంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా నామమాత్రపు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా, శ్రీలంక తలపడ్డాయి. టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి శ్రీలంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసియాకప్‌ 2025లో ఇప్పటివరకు ఒక టీమ్‌ చేసిన అత్యధిక స్కోర్‌ ఇదే కావడం విశేషం. భారత బ్యాటర్లలో అభిషేక్‌ శర్మ, తిలక్‌వర్మ రాణించారు. అభిషేక్‌ 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌ సాయంతో 61 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అతడికిది వరుసగా మూడో హాఫ్‌సెంచరీ. తిలక్‌ వర్మ 34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

సంజుశాంసన్‌ 23 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌ల సాయంతో 39 పరుగులు చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌ (4; 3బంతుల్లో), హార్దిక్‌ పాండ్య (2; 3 బంతుల్లో) విఫలమయ్యారు. అక్షర్‌ పటేల్‌ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీర, హసరంగ, శనక, అసలంక తలో వికెట్‌ తీసుకున్నారు.

పథుమ్ నిస్సంక శతకం బాదడంతో, శ్రీలంక 20 ఓవర్లలో భారత్ పెట్టిన 202 పరుగుల లక్ష్యాన్ని సమం చేసింది. అయితే చివరికి సూపర్ ఓవర్ సహాయంతో భారత్ లంకపై విజయాన్ని సాధించింది.

శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక టాస్ గెలిచి, సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత జట్టుపై ముందు బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఆసియా కప్ 2025లో 18వ మ్యాచ్, శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది.

అయితే టోర్నమెంట్ దృష్ట్యా ఈ మ్యాచ్ పెద్దగా ప్రాధాన్యం కలిగినది కాదు, ఎందుకంటే ఫైనల్‌లో భారత్–పాకిస్తాన్ తలపడడం ముందే ఖరారైంది. శ్రీలంక బ్యాట్స్ మెన్ నిస్సంక అత్యధికంగా 106 పరుగులు చేసి రికార్డ్ సృష్టించారు.

Read More
Next Story