
సూర్యకుమార్ యాదవ్
టీ20 ప్రపంచకప్: ఇషాన్ కిషన్, రింకూకు పిలుపు
జట్టు నుంచి శుభ్ మన్ గిల్ తొలగింపు
వచ్చే ఏడాది భారత్- శ్రీలంక వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్, వికెట్ కీపర్ జితేష్ శర్మలను తొలగించారు.
ఆల్ రౌండర్ అక్షయ్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా తిరిగి నియమించారు. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్, హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ లను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఈ జట్టే వచ్చే ఏడాది జనవరి 21 నుంచి న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ లో ఆడతారు.
‘‘శుభ్ మన్ గిల్ ఎంత నైపుణ్యం ఉన్న ఆటగాడో మాకు తెలుసు. బహుశా ప్రస్తుతానికి కొంచెం పరుగులు సాధించడం లేదు. గత ప్రపంచకప్ లో కూడా మేము వేరే కాంబినేషన్ తో వెళ్లాం.
ఇప్పుడు కూడా ఆ కాంబినేషన్ మిస్ అవుతాం. అన్నింటికంటే ఎక్కువగా కాంబినేషన్ కావాలనుకుంటే 15 మందిలో ఎవరో ఒకరిని మిస్ అవ్వాలి. దురదృష్టవశాత్తూ ఈ సమయంలో గిల్ మిస్ అయ్యాడు’’ అని సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో అన్నారు.
కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. జట్టు పట్ల తాను సంతోషంగా ఉన్నానని అన్నారు. ‘‘మేము ఆడిన ఏ జట్టు క్రీడలో నైనా మేము ఆడిన అన్ని ద్వైపాక్షిక మ్యాచ్ ల మాదిరిగానే ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు వస్తారు వెళతారు.
ఆటగాళ్లు తిరిగి వచ్చినప్పుడూ వారికి అవకాశాలు లభిస్తాయి. మేము ప్రస్తుతం ఉన్నట్లుగానే సంతోషంగా ఉన్నాము. ప్రస్తుతం మా వద్ద ఉన్న జట్టుతో 2-3 కాంబినేషన్ లు సిద్ధంగా ఉన్నాయి. ఉన్నదానితో మేము సంతృప్తిగా ఉన్నాము’’.
2026 టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకూ భారత్- శ్రీలంక వేదికలో జరుగుతున్నాయి. 2024 లో టైటిల్ గెలుచుకున్న భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచింది.
ఫిబ్రవరి 7న ఢిల్లీలో అమెరికాతో జరిగే మ్యాచ్ లో భారత్ తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. పాకిస్తాన్, అమెరికా, నమీబీయా, నెదర్లాండ్ తో పాటు భారత్ గ్రూప్ ఏలో ఉంది. టీ20 ప్రపంచకప్ ప్రారంభమయ్యే వరకు పేర్కొన్న 15 మందిలో ఎవరినైనా భర్తీ చేయడానికి బీసీసీఐకి అవకాశం ఉంది.
అంతకుముందు ఈ సంవత్సరం ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫి సమయంలో దుబాయ్ లో స్లో ట్రాక్ లను పరిగణలోకి తీసుకున్న తరువాత యశస్వి జైస్వాల్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నారు.
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హర్దిక్ పాండ్యా, శివమ్ దూబే, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్
Next Story

