భారత్ ఈ సారి అక్కడ ‘హ్యాట్రిక్’ సాధిస్తుంది: రవిశాస్త్రి
గత రెండు పర్యాయాలు ఆసీస్ లో పర్యటించిన టీమిండియా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫిని కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా మన లైనప్ బలంగా ఉందని.. అయితే
ఆస్ట్రేలియాలో ఈ ఏడాది చివరలో జరిగే బోర్డర్- గవాస్కర్ సిరీస్ ను భారత్ మూడో సారి గెలుచుకుంటుందని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. బౌలర్ల నాణ్యత, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో కూడిన మన జట్టు హ్యాట్రిక్ సిరీస్ విజయాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2015 ప్రారంభంలో కంగారూల సొంత గడ్డపై 2-0తో సిరీస్ విజయం సాధించినప్పటి నుంచి ఆస్ట్రేలియాలో భారత్ చివరి రెండు టెస్ట్ సిరీస్‌లను గెలుచుకుంది. "జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ తో పాటు మీకు అక్కడ మహ్మద్ సిరాజ్ లాంటి ఆటగాళ్లు కీలకంగా మారారని అన్నారు. మీకు అశ్విన్, జడేజా వంటివారితో బెంచ్ బలంగా ఉందని పేర్కొన్నారు. భారత్ కచ్చితంగా హ్యట్రిక్ సిరీస్ లు గెలుచుకుంటుందని అన్నారు.
ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. భారత్ ఈ సారి ఆసీస్ లో 3-1 తో సిరీస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. భారత బౌలర్లు, బ్యాట్స్ మెన్లకు ఈ సారి గట్టి సవాల్ ఎదురుకానుందని చెప్పారు. అయితే రవిశాస్త్రి మాత్రం పాంటింగ్ మాటలను కొట్టి పడేశారు.
భారత్‌కు హ్యాట్రిక్ సాధించే అన్ని అవకాశాలు ఉన్నాయి, మన జట్టు మంచి బౌలర్‌లను మంచి ఫిట్ నెస్ తో కలిగి ఉంది. వారు బాగా బ్యాటింగ్ చేయగలిగితే, మరోసారి ఆస్ట్రేలియాను వారి స్వదేశంలో ఓడించగలరని శాస్త్రి అన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో పెర్త్‌లో జరిగే టెస్టుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభించనుంది.
గత ఏడాది ఓవల్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రోహిత్ సేనపై కమిన్స్ సేన విజయం సాధించింది. కాబట్టి ఆసీస్ మంచి జోష్ లో ఉంది.
గత రెండు పర్యటనలలో భారత్ రెండుసార్లు ఆస్ట్రేలియాను ఓడించింది. దాదాపు దశాబ్ద కాలంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై ఆస్ట్రేలియాకు ఓటమి తప్పటం లేదు. రెండు సార్లు కేవలం యువ జట్టుతోనే భారత్ ఆస్ట్రేలియాలో సిరీస్ ను గెలుచుకుంది.
ముఖ్యంగా చివరిగా ఆసీస్ లో జరిగిన బోర్డర్ - గవాస్కర్ సిరీస్ మొదటి టెస్ట్ లో భారత్ రెండో ఇన్సింగ్స్ లో కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయి, ఘోర ఓటమిని చవి చూసింది. కానీ తరువాత అనూహ్యంగా ఫుంజుకున్న భారత్ 2-1 తో సిరీస్ గెలుచుకుంది.
Next Story