ధోని రికార్డు సమం చేసిన పంత్.. బంగ్లా ముందు భారీ లక్ష్యం
x

ధోని రికార్డు సమం చేసిన పంత్.. బంగ్లా ముందు భారీ లక్ష్యం

భారత లెజెండరీ బ్యాట్స్ మెన్ ఎంఎస్ ధోని రికార్డును ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ సమం చేశాడు. ఇప్పటి దాకా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు..


చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ సెంచరీ సాధించడంతో టెస్ట్ క్రికెట్ లో ఓ కొత్త రికార్డు తన పేరు మీద లిఖించుకున్నాడు. ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు పంత్ 128 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 109 పరుగులు చేశాడు.

ఇది టెస్టు క్రికెట్‌లో పంత్‌కి ఆరో సెంచరీ కాగా, ఈ సెంచరీతో టెస్టులో ఓ కీపర్ గా భారత్ లెజెండరీ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన సెంచరీల రికార్డును సమయం చేశాడు. ఇప్పటి వరకూ భారత్ లో ధోని మాత్రమే ఇన్ని కీపర్ గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించాడు.
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా పంత్, ధోనీ సంయుక్తంగా రికార్డు సృష్టించారు. ధోనీ తన 90-మ్యాచ్‌ల అద్భుతమైన కెరీర్‌లో ఆరు టెస్టు సెంచరీలు సాధించగా, పంత్ ఆరు సెంచరీలు చేయడానికి కేవలం 34 టెస్టులు మాత్రమే తీసుకున్నాడు. ఆరు టెస్టు సెంచరీలు సాధించేందుకు ఎడమచేతి వాటం ఆటగాడు పంత్ 58 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు, ధోనీకి 144 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
600 రోజుల సుదీర్ఘ విరామం తరువాత పంత్ టెస్ట్ క్రికెట్ లో పునరాగమనం చేశాడు. డిసెంబర్ 2022 లో ఒక భయంకరమైన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అనేక నెలల పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. గాయాల నుంచి కోలుకున్న తరువాత అనేక సాధనలు చేసి తిరిగి క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టాడు. ఇటీవల US- కరేబియన్ దీవులలో ICC T20 ప్రపంచ కప్ 2024 గెలిచిన రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టులో భాగంగా ఉన్నాడు.
శనివారం ఆటలో భారత ఆటగాడు శుభ్ మన్ గిల్ సైతం సెంచరీ సాధించాడు. గిల్ 176 బంతుల్లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 119 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గిల్, పంత్ నాలుగో వికెట్‌కు 167 పరుగులు జోడించడంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను నాలుగు వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ టెస్టులో బంగ్లాదేశ్‌కు ఆతిథ్య జట్టు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

India vs Bangladesh, MS Dhoni, Rishabh Pant, Chennai Test, Pant equals Dhoni

6 – ఎంఎస్ ధోని, రిషబ్ పంత్
3 - వృద్ధిమాన్ సాహా
వికెట్ కీపర్ల ద్వారా అత్యధిక టెస్టు సెంచరీలు
17 – ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)
13 – ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే)
8 – లెస్ అమెస్ (ఇంగ్లండ్)
7 – ఎబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), మాట్ ప్రియర్ (ఇంగ్లండ్), కుమార సంగక్కర (శ్రీలంక), బిజె వాట్లింగ్ (న్యూజిలాండ్)



Read More
Next Story