టీ20 ప్రపంచకప్: మూడు దశాబ్ధాల ’కల‘, దశాబ్దపు లక్ష్యమా?
ఒక జట్టు గత మూడు దశాబ్దాల ఐసీసీ ప్రధాన టైటిల్ కోసం వేచి చూస్తునే ఉండగా, మరో జట్టు గడచిన దశాబ్దంలో అనేక ఫైనల్లో ఓటమి పాలై ఇప్పుడు మరోసారి టైటిల్ అందుకోవాలని..
ఆ దేశంలో చాలా కాలం పాటు వర్ణవివక్ష విధానం అమలు చేసి అంతర్జాతీయ సమాజం చేత ఛీత్కారానికి గురైయ్యారు. అయితే 1991 లో వచ్చిన మార్పు.. వారిని ప్రపంచ క్రికెట్ లోకి ఆహ్వనం పలికింది. ఆ జట్టే దక్షిణాఫ్రికా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో కీలక పాత్ర పోషించింది భారతే. వారి తొలి పర్యటన భారత్ లోనే జరిగింది. అప్పటి జట్టు కెప్టెన్ క్లైవ్ రైస్ నేతృత్వంలోని జట్టు మూడు వన్డేల సిరీస్ ను ఆడటానికి నవంబర్ లో ఇండియాకు వచ్చారు.
వారిని స్వాగతించడానికి కోల్ కతా లో ప్రజలు బారులు తీరారు. ఈడెన్ గార్డెన్స్ లో ఒక్క కిక్కిరిసిన ప్రాంతంలో వారికి ఘన స్వాగతం పలికారు. అయితే తాము ఆడిన మొదటి ఇంటర్నేషన్ లో గేమ్ లోనే తమ క్రికెట్ ప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో బలంగా నిరూపించారు ప్రోటీస్ టీమ్. అయితే వారి మొదటి ప్రపంచకప్ ఫైనల్ కు చేరడానికి దాదాపు 35 సంవత్సరాలకు పట్టడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం.
తృటిలో తప్పినవి..
గత మూడు దశాబ్దాల్లో ప్రోటీస్ క్రికెట్ ప్రపంచంలో ఏజట్టుకు ఎదురవ్వని దురదృష్టాలు మైదానంలో ఎదురయ్యాయి. వారి మొదటి ట్రాజెడీ 1992 లో ఎదురైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో జరిగిన ఈ ప్రపంచకప్ లో ఇంగ్లండ్ తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన తరుణంలో వర్షం అంతరాయం కలిగించింది.
అయితే అప్పటి నిబంధనల ప్రకారం వర్షం తగ్గిన తరువాత ఒక్క బంతిలో 22 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో ఆ జట్టు ఓటమి పాలైంది. ఆ తరువాత 1999 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి, 2003 లో శ్రీలంక చేతిలో ఒక్క పరుగుతో ఓటమి ఇలా అనేక కీలక ఐసీసీ ఈవెంట్లలో ఓటమితో చోకర్స్ అనే పేరును ఇప్పటికి మోస్తున్నారు.
భారత్ కూడా ఐసీసీ ఈవెంట్లలో ఇదే తరహ ఆటతీరును ప్రదర్శిస్తోంది. 1999 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్లో అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. తరువాత 2003 ప్రపంచకప్ ఫైనల్ లో ఓటమిపాలైంది. అయితే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ అయ్యాక 2007 లో తొలిసారిగా టీ20 ప్రపంచకప్ అందించారు.
2009లో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ స్థానం, 2011 ప్రపంచకప్, 2013 ఛాంపియన్ ట్రోఫి భారత్ కు అందించారు. అయితే ఆ తరువాత భారత్ అన్ని ఐసీసీ ఈవెంట్లలో దక్షిణాఫ్రికా తరహా ఆటతీరునే కనబరుస్తోంది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో శ్రీలంక చేతిలో ఓటమి, 2017 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి ఫైనల్ లో పాక్ చేతిలో ఓటమి, 2021 లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ న్యూజిలాండ్ చేతిలో ఓటమి, 2023 వన్డే ప్రపంచకప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ ల ఆస్ట్రేలియా ఓటమి ఇలా అనేక ఐసీసీ ఫైనల్లో భారత్ రికార్డు కూడా గొప్పగా ఏం లేదు.
ప్రపంచ ఛాంపియన్ లను ఇంటికి..
అయితే 2023 ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ ను ఓడించిన ఆస్ట్రేలియా ను సూపర్ ఎయిట్ లో ఇంటికి పంపాం. 2022 లో సెమీస్ లో ఓడించిన ఇంగ్లండ్ ను ఈ ప్రపంచకప్ లో సెమీస్ లోనే ఇంటికి పంపించాం. అయితే ఏం జరిగిన ఈ సారి కప్పు గెలవాలిన టీమిండియా పట్టుదలగా ఉంది. ప్రత్యర్థి ఏదైనా ఫైనల్లో గెలవాలని అదే సరైన పరిష్కారం అని మేనేజ్ మెంట్ భావిస్తోంది.
ఇది ప్రధాన కోచ్ రాహూల్ ద్రావిడ్ కు చివరి సిరీస్. తరవాత కోచ్ గా తప్పుకోనున్నాడు. రోహిత్ శర్మ, కోహ్లిలకు కూడా ఇదే చివరి టీ20 వరల్డ్ కప్. సంవత్సరం క్రితం వన్డే ప్రపంచకప్ లో ఫైనల్లో ఆత్మరక్షణ ధోరణిలో ఆడి జట్టు మంచి అవకాశం వదులుకుంది. ధైర్యంగా ఆడితేనే విజయం వరిస్తుందని
భారత్ బుల్ రన్
ప్రపంచకప్‌లో భారత్ బుల్ రన్ కొనసాగిస్తుంది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని మ్యాచ్ లను అజేయంగా ముగించింది. న్యూయార్క్ లోని కష్టతరమైన పిచ్ లపై అద్భుతంగా మ్యాచ్ లను ముగించింది. పాకిస్తాన్ పై అనూహ్యంగా విజయం సాధించిన తరువాత కరేబియన్ దీవుల్లోకి అడుగుపెట్టాక తన వ్యూహాన్ని మార్చుకుంది. తమ టీమ్ లోని కుల్దీప్ ను జాయిన్ చేసుకున్నాక వైవిధ్యం కుదిరింది. జస్ప్రీత్ బూమ్రా పైనే నమ్మకం పెట్టుకున్న భారత్, ఇప్పుడు కుల్దీప్ కూడా నమ్మదగ్గ బౌలర్ గా మారాడు.
బ్యాట్‌తో, కోహ్లి మినహా టాప్ సిక్స్‌లో ఉన్న అందరి నుంచి మంచి ప్రదర్శనలు ఇచ్చారు. రోహిత్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మంచి దూకుడైన ఆట తీరుతో ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్ స్టార్క్ కు చుక్కలు చూపించాడు. అయితే ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆచితూచి ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ ఫార్మాట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. పాండ్యా, పంత్, దూబే తమ తమ పాత్రలను చక్కగా నిర్వర్తిస్తున్నారు.
భారత్‌కు కోహ్లీ నైపుణ్యం అవసరం
ఇవన్నీ కోహ్లి కష్టాలను పరోక్షంగా ఎత్తి చూపెడుతున్నాయి. మాజీ కెప్టెన్ ఐపీఎల్‌లో 700కు పైగా పరుగులు సాధించాడు. అయితే కింగ్ కోహ్లి ప్రపంచకప్ లో వరసగా ఫెయిల్ అవుతున్నాడు. ఏడు ఇన్సింగ్స్ లో కేవలం 75 పరుగులు మాత్రమే సాధించాడు.
కోహ్లి ఈ మధ్య పవర్ గేమ్ ఆడుతున్నాడు. నిజానికి ఇది అతని సహజ గేమ్ కాదు.ఇప్పుడు భారత దేశానికి పాత కోహ్లి కావాలి. మొత్తం టీ20 ల్లో భారత్ 9-4 తో ఆధిక్యంతో ఉంది. ప్రపంచకప్ లో 4-1 రికార్డు ఉంది. అయితే దక్షిణాఫ్రికా బలహీనమైన ప్రత్యర్థి. వారి జట్టులో బలమైన బ్యాట్స్ మెన్స్, బౌలింగ్ లైనప్ ఉంది. ఫైనల్లో బ్రిడ్జిటౌన్ లోని నంబర్ ఫోర్ పిచ్ లోని ఈ మ్యాచ్ జరగబోతోంది. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా ఫైనల్ మాత్రం హోరాహోరీగా సాగుతుందనడంలో సందేహం లేదు.
Next Story