పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన భజ్జీ..
x

పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన భజ్జీ..

పాకిస్తాన్ తో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్ లో చివరి ఓవర్ బౌలింగ్ కు దిగిన అర్షదీప్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమ్రాన్ అక్మల్.. భజ్జీ ఇచ్చిన పంచ్ తో..


భారత పేసర్ అర్ష్ దీప్ సింగ్ కు చెందిన సిక్ కమ్యూనిటీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల న్యూయార్క్ లో భారత్- పాకిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో పాక్ ఆరు పరుగుల చేతిలో ఓటమి పాలయింది.

ఈ సందర్భంగా అక్మల్, సింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక వైరల్ వీడియోలో, అక్మల్ అర్ష్‌దీప్, సిక్కు మతాన్ని ఎగతాళి చేయడం కనిపించింది. ఈ వీడియోలపై భారత్ టర్బోనేటర్, మాజీ ఆటగాడు హర్బజన్ సింగ్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఈ వివాదం కాస్త ముదురుతుండటంతో అక్మల్ క్షమాపణలు చెప్పారు.

“నేను నా ఇటీవలి వ్యాఖ్యలకు తీవ్రంగా చింతిస్తున్నాను. హర్భజన్ సింగ్, సిక్కు సమాజానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. నా మాటలు అసందర్భంగా, అగౌరవంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది. ఎవరినీ బాధపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను నిజంగా క్షమించండి. #Respect #Apology,” అని అక్మల్ హర్భజన్‌ను ట్యాగ్ చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో రాశాడు.
120 పరుగుల ఛేజింగ్‌లో పాకిస్థాన్‌కి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమయ్యాయి. మ్యాచ్ పై పాకిస్తాన్ కు చెందిన ఓ న్యూస్ ఛానల్ లో అక్మల్ వివరిస్తూ అర్ష్ దీప్ ను, అతని సిఖ్ మతం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
“కుచ్ భీ హో సక్తా హై... దేఖే లాస్ట్ ఓవర్ కర్నా అర్ష్‌దీప్ సింగ్ నే హై. వైసే ఉస్కా రిథమ్ నహీ లగా. 12 బాజ్ గయే హై (ఏదైనా జరగవచ్చు. చివరి ఓవర్ అర్ష్‌దీప్ సింగ్ వేస్తాడు; అతను గొప్ప రిథమ్‌లో కనిపించలేదు.)" అని అతను చెప్పాడు.
హర్భజన్ రీపోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఈ షోలో ఇతర ప్యానెలిస్ట్‌లతో అక్మల్ కూడా నవ్వుతూ కనిపించాడు. దీనిపై భజ్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
"...నీవు నోరు విప్పే ముందు సిక్కుల చరిత్ర తెలుసుకోవాలి. మేము సిక్కులు మీ తల్లులు, సోదరీమణులను ఆక్రమణదారులచే అపహరించినప్పుడు వారిని రక్షించాము, కొంత కృతజ్ఞత కలిగి ఉండండి" అని భజ్జీ అన్నారు.
న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన విజయంతో భారత్‌ను గ్రూప్-ఎలో రెండు విజయాల్లో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిపింది
Read More
Next Story